Education Department : విద్యారంగంలో ఉన్న సమస్యలపై పరిష్కరించేందుకు పలు సూచనలు..
Sakshi Education
అమలాపురం టౌన్: విద్యారంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయి శ్రీనివాస్ సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన అమలాపురంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలను పరిష్కరించేందుకు ఎస్టీయూ తరఫున కొన్ని సూచనలు ప్రభుత్వానికి చేశామని చెప్పారు. మొత్తం 31 అంశాలతో ప్రభుత్వానికి నివేదించామని వివరించారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పోతంశెట్టి దొరబాబు, ప్రధాన కార్యదర్శి సరిదే సత్య పల్లంరాజు, ఆర్థిక కార్యదర్శి నేరేడుమిల్లి సత్యనారాయణ, అభయ్ కన్వీనర్ రాపాక ప్రసాద్, స్టేట్ కౌన్సిలర్ బోణం గంగాధర్, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
Published date : 06 Jul 2024 10:57AM