Skip to main content

Jobs In Artificial Intelligence- ఏఐకి ఫుల్‌ డిమాండ్‌... టెన్త్‌ తర్వాత ఈ కోర్సు చేస్తే చాలు

 Jobs In Artificial Intelligence Skill Required
Jobs In Artificial Intelligence Skill Required

ఇప్పుడంతా టెక్నాలజీ మయం. కొన్నేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఏఐ అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. మనిషి చేసే దాదాపు అన్ని పనులను యంత్రాలు చేసేలా కృత్రిమ మేథస్సుతో తయారుచేస్తున్నారు. భారత్‌లో పెరుగుతున్న ఏఐ బూమ్‌ ద్వారా కార్పేరేట్‌ కంపెనీల్లోనూ ఈ రంగంలో నిపుణులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది.

సమర్ధులైన చాట్‌జీపీటీ నిపుణులకు ఏడాదికి రూ.కోటిన్నర వరకూ ఆఫర్ చేసేందుకు కూడా కంపెనీలు రెడీగా ఉన్నాయి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉద్యోగాలు ఎలా ఉంటాయి? దీనికోసం ఎలాంటి స్కిల్స్‌ నేర్చుకోవాల్సి ఉంటుంది? ఈ రంగంలో కెరీర్‌ ఎలా ఏర్పరుచుకోవాలి? అన్న వివరాలు తెలుసుకుందాం. 

 

ఏఐతో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి?

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజనీర్‌
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్లకు ప్రస్తుతం భారీ డిమాండ్‌ ఉంది. వీరికి ముఖ్యంగా ప్రోగ్రామింగ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, డేటా సైన్స్‌పై మంచి అవగాహన ఉండాలి. 

మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్‌
రీసెర్చింగ్‌, బిల్డింగ్‌, సెల్ఫ్‌ రన్నింగ్‌ ఏఐ సిస్టమ్‌పై మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్‌ పనిచేస్తారు. 

డేటా ఇంజనీర్‌
డేటా ఇంజనీర్లు మనకు వచ్చిన డేటాను డేటా సైంటిస్టుకు తగిన విధంగా మారుస్తారు. 

డేటా సైంటిస్ట్‌
డేటా ఇంజనీర్‌ అందించిన డేటాను కంపెనీ ఇచ్చిన టాస్కులకు అనుగుణంగా విభజిస్తారు. వీరికి స్టాటిస్టిక్స్‌, సైంటిఫిక్‌ మెథడ్స్‌, ఆల్గారిథమ్స్‌పై పూర్తి అవగాహన ఉండాలి. 

రోబొటిక్‌ ఇంజనీర్‌
రోబోటిక్‌ ఇంజనీర్లు రోబోట్‌లను, రోబోట్‌ ప్లాట్‌ఫామ్స్‌ను డిజైన్‌ చేస్తారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు
వీరు ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ను ఉపయోగించి సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌పై పనిచేస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌, టెస్టింగ్‌, డెవలపింగ్‌ వంటి వాటిపై ఎప్పటికప్పడు కొత్త అప్‌డేట్స్‌ను అర్థం చేసుకుంటూ పని చేయాల్సి ఉంటుంది. 


ఏఐలో కెరీర్‌ కోసం ఏం చదవాలి?
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్‌కు బాగా డిమాండ్ పెరుగుతోంది. ఇంటర్‌ తర్వాత ఎలాంటి కెరీర్‌ ఎంచుకోవాలో తెలియక అయోమయంలో ఉండే విద్యార్థులకు ఏఐ బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పొచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ చదవాలంటే 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌తో పాటు కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి సబ్జెక్టుల్లో డిగ్రీ కలిగి ఉండాలి. మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌లో మంచి సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ను పెంపొందించుకోవాలి. 

ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌
ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌లో కెరీర్‌ రూపొందించుకోవాలంటే Python, Java, R, C++ మొదలైన ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌పై పట్టు ఉండాలి. డెస్క్‌టాప్‌ అప్లికేషన్స్‌, వెబ్‌సైట్‌ అప్లికేషన్స్‌, మొభైల్‌ అప్లికేషన్స్‌ అన్నిట్లో ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. 

కోట్లల్లో వేతనాలు
చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ మనుషుల కంటే వేగంగా మాన‌వ త‌ర‌హాలో అనేక ప‌నులు చ‌క్క‌బెడుతుండ‌టంతో ఉద్యోగుల స్ధానంలో ఏఐ టూల్స్‌ను వినియోగించేందుకూ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. టెక్నాల‌జీ రంగంలో చాట్‌జీపీటీ అవ‌స‌రం పెరుగుతుండ‌టంతో ఏఐ చాట్‌బాట్‌ను ఉప‌యోగించే నిపుణులకు పెద్ద‌సంఖ్య‌లో కొలువులు అందుబాటులోకి వ‌స్తున్నాయి.కొన్ని కంపెనీలు అయితే  చాట్‌జీపీటీ, సీనియర్‌ మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్లకు ఏకంగా ఏడాదికి రూ. కోటిన్న‌ర చెల్లించేందుకూ సిద్ధ‌మ‌య్యాయి. 

 

Published date : 10 Jan 2024 08:51AM

Photo Stories