Skip to main content

Holiday on 22nd January 2024 : దేశవ్యాప్తంగా జనవరి 22వ తేదీన‌ సెలవు ప్రకటించిన కేంద్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : అయోధ్యలోని రామాలయంలో జ‌న‌వ‌రి 22వ తేదీ బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయోధ్యలో రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జనవరి 22న దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క పూట సెలవు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
National Holidays January 22nd News  Inauguration of Balarama Idol in Ayodhya's Ram Temple on January 22 Central Government Declares Holiday for Rama Idol Inauguration   Special Holiday for Central Government Staff on Ayodhya's Ram Temple Event

ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన చేశారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, హర్యానా రాష్ట్రాలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గోవా రాష్ట్రంలో పాఠశాలలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. 

 Ayodhya Ram Mandir Live Updates 2024 : అయోధ్య రామ జన్మభూమి కేసులో..ఒకేఒక్క‌డు.. కళ్లు ఉండి చేయలేని పనిని.. కళ్లు లేని ఈ స్వామీ..

ఈ నేపధ్యంలోనే ఆ రోజు పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఏ రాష్ట్రాల్లో ఈ నెల 22న పాఠశాలలకు సెలవులు ప్రకటించారంటే..

jan 22nd school and colleges holiday

ఉత్తర ప్రదేశ్‌లో
ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 22న పాఠశాలలకు సెలవుపై ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22న రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేస్తున్నట్లు యోగి తెలిపారు. ఆ రోజున ఏ విద్యా సంస్థలనూ తెరవరు.

మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్‌లోనూ పాఠశాలలు, కళాశాలలకు 22న సెలవు ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద పండుగలాంటిదని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. 

గోవాలో..
22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గోవా ప్రభుత్వం..  ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలకు, కళాశాలలకు సెలవు ప్రకటించింది.

ఛత్తీస్‌గఢ్‌లో..
ఛత్తీస్‌గఢ్‌లో కూడా జనవరి 22న పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది.

హర్యానాలో..
హర్యానాలో కూడా రామ్‌లల్లా పవిత్రోత్సవంనాడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఆ రోజున మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

అలాగే తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది.

 Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

Published date : 19 Jan 2024 11:59AM

Photo Stories