Skip to main content

High Package Job : లక్కీ ఛాన్స్‌.. రూ.1.70 కోట్ల జీతంతో ఉద్యోగం.. ఎలా అంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన భార్గవ్‌కుమార్‌రెడ్డి లక్కీఛాన్స్‌ కొట్టాడు.
Bhargav kumar Reddy from Gollapally in the Penukonda mandal of Sri Satyasai district
Bhargav kumar Reddy

ఏడాదికి రూ.1.70 కోట్ల జీతంతో క్వాల్‌కాం మల్టీ ఇంటర్నేషనల్‌ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో ఎంఎస్‌ (ఎంటెక్‌) చదువుతున్న భార్గవ్‌కుమార్‌రెడ్డి ఇంకా పట్టా తీసుకోకముందే రూ.కోట్ల కొలువు దక్కించుకున్నాడు.

Inspirational Success Story : కంటి చూపులేక‌పోతేనేం... 47 ల‌క్ష‌ల‌తో జాబ్ కొట్టాడిలా..

చదువు పూర్తికాగానే..

qualcomm company

ఆయన చదువు డిసెంబర్‌లో పూర్తి కానుండగా, అతని నైపుణ్యం గుర్తించిన క్వాల్‌కాం కంపెనీ అంతకుముందే ఏడాదికి రూ. 1.70 కోట్లు ప్యాకేజీ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. చదువు పూర్తికాగానే క్వాల్‌కాంలో చేరనున్న భార్గవ్‌కుమార్‌రెడ్డి అధునాతన చిప్‌ల తయారీపై పనిచేయాల్సి ఉంటుంది. భార్గవ్‌ ప్రతిభను గుర్తించిన అరిజోనా యూనివర్సిటీ ఇప్పటికే అతనికి రూ. 20 లక్షలు స్కాలర్‌ షిప్‌ ఇవ్వడం విశేషం.

Resignation: ఆఫీస్‌కు ర‌మ్మ‌న్నారు.. రూ.8కోట్ల శాలరీని కాద‌న్నాడు..!

Success Story: రూ.1.20కోట్ల ప్యాకేజీతో ప్ర‌ముఖ కంపెనీలో ఉద్యోగం..

అస‌లు ఊహించలేదు..
ఈ సందర్భంగా భార్గవ్‌ తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, అలివేలమ్మ మాట్లాడుతూ.. తమ కుమారుడు ఏడాదికి రూ.కోటి సంపాదించే ఉద్యోగంలో చేరతాడని తాము ఊహించలేదన్నారు. చిన్నప్పటి నుంచీ కష్టపడి చదివే తమ కుమారుడి ప్రతిభ గుర్తించి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు విద్యాసంస్థలు ఫీజుల్లో పెద్ద ఎత్తున రాయితీ ఇచ్చాయన్నారు.

Inspiring Story: ఫంక్షన్స్‌లో మాపై ‘చిన్న చూపు’.. ఈ క‌సితోనే రూ.40 లక్షల ప్యాకేజీతో..

Job: శ్రీకాళహస్తి అమ్మాయికి రూ.40 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎలా వ‌చ్చిందంటే..?

Published date : 15 Dec 2022 06:18PM

Photo Stories