Skip to main content

Resignation: ఆఫీస్‌కు ర‌మ్మ‌న్నారు.. రూ.8కోట్ల శాలరీని కాద‌న్నాడు..!

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌లో ఉద్యోగం అంటే మాటలా. పేరుకు పేరు. డబ్బుకు డబ్బు. కానీ అదే సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి మాత్రం విరక్తి. అందుకే శాలరీ రూ.8 కోట్లు (అంచనా) తీసుకుంటున్నా.. ఆ జాబ్‌ను తృణ ప్రాయంగా వదిలేశాడు.
Ian Goodfellow
Ian Goodfellow

నీ సంస్థ వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ రాజీనామా చేశాడు. ప్రస్తుతం ఈ రిజిగ్నేషన్‌ అంశం యాపిల్‌తో పాటు ఇతర టెక్‌ సంస్థల్లో చర్చాంశనీయంగా మారింది.

Inspiring Story: ఫంక్షన్స్‌లో మాపై ‘చిన్న చూపు’.. ఈ క‌సితోనే రూ.40 లక్షల ప్యాకేజీతో..

కొత్త రూల్‌ కారణంగా..
సుధీర్ఘ కాలం తర్వాత ప్రముఖ టెక్‌ దిగ్గజ కంపెనీలతో పాటు ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి చెబుతున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్లతో కుస్తీ పడుతున్నారు. అయితే ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు కోట్లలో శాలరీ తీసుకుంటున్నా.. ఉన్న ఫళంగా జాబ్‌ రిజైన్‌ చేస్తున్నారు. ఆఫీస్‌కు రావాలంటే కుదరదు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయమంటే చేస్తాం. లేదంటే జాబ్‌ రిజైన్‌ చేస్తామంటూ బాస్‌లకు మెయిల్స్‌ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్‌ దిగ్గజం యాపిల్‌ కంపెనీలో మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఇయాన్ గుడ్‌ఫెలో ఆ సంస్థకు భారీ షాక్‌ ఇచ్చారు. ఆఫీస్‌ అమలు చేసిన కొత్త రూల్‌ కారణంగా తన జాబ్‌కు రిజైన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

IT Jobs: పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న టాప్ ఐటీ కంపెనీలు ఇవే..!

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ విష‌యంలో..
కరోనా కారణంగా యాపిల్‌ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసే వారు. కానీ ఇటీవల సంస్థ తన ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ పిలుపునిచ్చింది. హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ పాలసీని అమలు చేసింది. యాపిల్‌ కొత్త వర్క్ పాలసీ ప్రకారం.. ఉద్యోగులు ఏప్రిల్ 11 నుంచి వారానికి కనీసం ఒక రోజు, ఆఫీస్‌కు వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత అది కాస్త మే 2 నుంచి వారానికి రెండు రోజులకు పెరిగింది. ఇప్పుడు, యాపిల్‌ తన ఉద్యోగులను కనీసం మూడు రోజుల పాటు ఆఫీసుకు తిరిగి రావాలని కోరింది. మే 23 నుంచి వారానికి 5 రోజులు పనిచేయాలని కొత‍్త పాలసీలో స్పష్టం చేసింది.

Job: శ్రీకాళహస్తి అమ్మాయికి రూ.40 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎలా వ‌చ్చిందంటే..?

యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ రాసిన...
ఈ నిర్ణయంపై గుడ్‌ఫెలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో వర్క్‌ ప్రొడక్టివిటీ పెరుగుతుందని, తన టీం సభ్యుల వర్క్‌ ఫ్లెక్సిబులిటీ తనకు ముఖ్యమని, వాళ్లకి బాగుంటే వర్క్‌ రిజల్ట్‌ బాగుంటుందని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ రాసిన మెయిల్స్‌ తాను తన జాబ్‌కు ఎందుకు రిజైన్‌ చేస్తున్నాడో వివరించాడు.

Job Opportunity: ప్ర‌ముఖ కంపెనీల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి ఉద్యోగం..శాల‌రీ ఎంతంటే..?

రూ.8 కోట్లు వ‌చ్చే శాల‌రీ కాద‌నీ..

Apple


వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక ప్రకారం, గతంలో ఇయాన్ గుడ్‌ఫెలో జీతం సంవత్సరానికి రూ. 6 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2016 నుంచి టెస్లాలో పని చేసిన అతని శాలరీ సంవత్సరానికి కనీసం రూ.6 కోట్లుగా ఉందని, టెస్లాకు రిజైన్‌ చేసిన గూగుల్‌లోకి వెళ్లడంతో అతని శాలరీ పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఇక 2019లో యాపిల్‌లో చేరిన  గుడ్‌ ఫెలో శాలరీ రూ.6 కోట్ల నుంచి రూ.8కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ వెలుగులోకి వచ్చిన నివేదిక హైలెట్‌ చేసింది.

నువ్వు వద్దు.. నీ జాబు వద్దు.. ఆఫీస్‌కు రాం..రాం..
కోవిడ్‌ సంక్షోభం సమయంలో ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్న కార్పొరేట్‌ కంపెనీలను ఇప్పుడు మరో రకమైన చిక్కులు పలకరిస్తున్నాయి. ఉద్యోగులు కోరుతున్న సహేతుకమైన డిమాండ్లు నెరవేర్చేలేక.. ఇటు పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు రచించలేక కార్పోరేట్‌ ‘హెచ్‌ఆర్‌’లు నెత్తి బొప్పి కడుతోంది. ఎడ్‌టెక్‌ యూనికార్న్‌ సంస్థ బైజూస్‌కి చెందిన వైట్‌హ్యాట్‌ జూనియర్‌కు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు గుడ్‌బై చెబుతున్నారు. నువ్వు వద్దు.. నీ జాబు వద్దు.. నీకో దండం అంటూ ఒక్కొక్కరుగా ఆ సం‍స్థను వీడి వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఆ సంస్థ చేసిన తప్పేంటి అంటే వాళ్లని ఆఫీసుకు వచ్చి పని చేయండి అని అడగడం!  

Success Story: రూ.1.20కోట్ల ప్యాకేజీతో ప్ర‌ముఖ కంపెనీలో ఉద్యోగం..

వర్క్‌ఫ్రం హోంలో..
కంప్యూటర్‌ కోడింగ్‌, మ్యాథమేటిక్స్‌ బోధించే ఎడ్‌టెక్‌ కంపెనీగా వైట్‌హ్యాట్‌ జూనియర్‌ ప్రారంభమైంది. కోవిడ్‌ సం​క్షోభం మొదలైన తర్వాత ఒక్కసారిగా ఎడ్‌టెక్‌ కంపెనీలకు గిరాకీ పెరిగింది. అప్పుడే దీన్ని బైజూస్‌ సంస్థ 300 మిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకుంది. విస్తరణలో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగులను చేర్చుకుంది. వారంతా వర్క్‌ఫ్రం హోంలో పని చేస్తున్నారు.

ఉద్యోగులకు హుకుం..
వైట్‌హ్యాట్‌ జూనియర్‌ సంస్థ నుంచి మార్చి 18న ఉద్యోగులకు ఈమెయిళ్లు వెళ్లాయి. కోవిడ్‌ తగ్గుముఖం పట్టినందు వల్ల నెలరోజుల్లోగా అంటే ఏప్రిల్‌ 18లోగా మీరంతా ఆఫీసులకు వచ్చి పని చేయాలంటూ తేల్చి చెప్పింది. ఈ సంస్థకు బెంగళూరు, గురుగ్రామ్‌, ముంబైలలో ఆఫీసులు ఉన్నాయి. కాబట్టి మీకు కేటాయించిన ఆఫీసులకు నెలరోజుల్లోరా రావాలంటూ ఉద్యోగులకు హుకుం జారీ చేసింది.

Job Opportunities : ఫ్రెషర్స్‌కు కాగ్నిజెంట్‌ బంపర్‌ ఆఫర్‌.. ఈ ఏడాది 50,000 ఉద్యోగాలు

రాజీనామాలను..
హెచ్‌ఆర్‌ నుంచి లెటర్‌ రావడం ఆలస్యం మాకు నువ్వు వద్దు. నీ ఉద్యోగం వద్దంటూ ఉద్యోగులు రాజీనామా చేయడం మొదలు పెట్టారు. తొలి గడువు ఏప్రిల్‌ 18 ముగిసే నాటికే ఏకంగా 800ల మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. మరో నెల గడిస్తే ఈ సంఖ్య రెట్టింపు అయ్యే ఛాన్స్‌ ఉంది.

ఉద్యోగులు చెబుతున్న కారణాలు ఇవే..

Job


☛ మాకంటూ కొన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. తల్లిదండ్రులను చూసుకోవాలి, పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. ఉన్నపళంగా నెల రోజులు టైం ఇ‍చ్చి సొంతూళ్లను వదిలి రావాలని చెప్పడం సరికాదు. అలా చేయలేం కాబట్టే రిజైన్‌ చేస్తున్నాను
☛ ఇంటర్వ్యూ చేసినప్పుడు రెండేళ్ల పాటు వర్క్‌ ఫ్రం హోం ఉంటుందని చెప్పారు. దానికి తగ్గట్టుగానే మా జీతభత్యాలు ఫైనల్‌ అయ్యాయి. ఇప్పుడు రెండేళ్లు పూర్తి కాకుండానే లివింగ్‌ కాస్ట్‌ ఎక్కువగా ఉండే బెంగళూరు, గురుగ్రామ్‌ లాంటి నగరాలకు రమ్మంటే ఎలా ? మా జీతాలు అక్కడి ఖర్చులకు సరిపోవు అందుకే వైట్‌హ్యాట్‌ జూనియర్‌కి గుడ్‌బై చెబుతున్నాం
☛ మరికొందరు నష్టాల్లో ఉన్న వైట్‌హ్యట్‌ కంపెనీ.. వాటిని తగ్గించుకునేందుకు తెలివిగా వేసిన ఎత్తుగడనే వర్క్‌ ఫ్రం హోంకి మంగళం పాడటం అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపళంగా ఉద్యోగులను రమ్మని చెప్పడం ద్వారా.. ఉద్యోగులు వాళ్లంత వాళ్లే బయటకు వెళ్లి పోయేలా ప్లాన్‌ చేశారని అంటున్నారు.

Software Jobs: సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయడమే మీ లక్ష్యమా.. ! అయితే మీకోస‌మే ఈ అవ‌కాశం

మినహాయింపు ఉంది.. కానీ
ఉద్యోగుల రాజీనామా పర్వంపై వైట్‌హ్యాట్‌ జూనియర్‌ సిబ్బంది స్పందిస్తూ.. మా ఆదేశాలను అనుసరించి చాలా మంది బెంగళూరు, గురుగ్రామ్‌ వంటి ప్రాంతాల్లో రిపోర్టు చేశారు. మెడికల్‌, ఇతర అవసరాలు ఉన్నాయన్న ఉద్యోగుల విషయంలో.. పరిశీలించి పలువురికి మినహాయింపులు కూడా ఇచ్చామని తెలిపారు.

IT Jobs: జోరుగా.. హుషారుగా.. ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు..!

Published date : 12 May 2022 07:54PM

Photo Stories