High Court: దక్కన్ కాలేజీ కాల్పుల కేసులో హైకోర్టు తీర్పు.. ఏకంగా పదేళ్ల జైలు శిక్ష!
ట్రయల్ కోర్టు ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ వెలువరించిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థిచింది. ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేయాలంటూ ఖాన్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ తీర్పు ఇచ్చారు.
2007 ఏప్రిల్‌లో దక్కన్ కాలేజీలో ముఖర్రం సిద్ధిఖీపై కాల్పులకు సంబంధించి నమోదైన కేసులో కిందికోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఖాన్ దాఖలు చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చారు. కాల్పులను ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలతో నిరూపించిందని, చిన్నపాటి లోపాలున్నాయని చెప్పి మొత్తం ప్రాసిక్యూషన్‌ను తప్పుపట్టలే మన్నారు.
చదవండి: Civil Judge Posts: జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
కాల్పుల తర్వాత ఘటనా స్థలానికి వెళ్లిన అప్పటి కార్వాన్ ఎమ్మెల్యే గన్‌మెన్ సాక్ష్యం కీలకంగా ఉందని అభిప్రాయపడ్డారు. కాల్పులకు ముందు, తర్వాత పరిస్థితులు అతని సాక్ష్యంలో ఉన్నాయని చెప్పారు. ’పిటిషనర్ చేతిలో రివాల్వర్ ఉన్నట్లు బాధితుడు చెప్పాడు. కాల్పులు జరిపిన ఖాన్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడంటే రివాల్వర్‌తో కాల్పులు జరిపితే ఏమౌతుందో తెలియని వ్యక్తి కాదు.
ఖాన్‌ని చంపాలన్న ఉద్దేశం ఉన్నట్లు అనిపించింది. బుల్లెట్ గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది డాక్టరు, బాధితుడు చెప్పినవి ఒకేలా ఉన్నా యి. కాల్పులను ప్రాసిక్యూషన్ నిర్ధారించినందున కింది కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి ఆస్కారం లేదు’ అని జస్టిస్ వేణుగోపాల్ తీర్పులో పేర్కొన్నారు.