Free Drone Training: డ్రోన్ వినియోగంపై గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ
గాంధీనగర్: వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ రాకతో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హరిత విప్లవం వచ్చిన తొలి నాళ్లలో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ జరిగింది. విత్తనం నాటే నాటి నుంచి పంట కోసే వరకు రైతులు పూర్తి స్థాయిలో యంత్రాలను వాడుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలోనూ కృత్రిమ మేథ (ఏఐ) ప్రవేశించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
గత ప్రభుత్వాలతో పోలిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసింది. గ్రామ స్థాయిలోనే రైతులకు యంత్ర పరికరాలు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, రైతుకు కావాల్సిన రుణం, పంటల బీమా, సాగుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి యువతను వ్యవసాయరంగం వైపు మళ్లించేందుకు వారికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. పంట పొలాల్లో చీడపీడల నివారణకు పురుగు మందులు పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగించేలా యువతకు శిక్షణ ఇప్పిస్తున్నారు.
Fellowship for YUV Student: పీహెచ్‌డీ పూర్తి చేసిన వైవీయూ విద్యార్థికి ఫెలోషిప్ మంజూరు
ఏఆర్‌పీసీ కోర్సులో శిక్షణ
వ్యవసాయ శాఖ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విద్యాలయం సహకారంతో వ్యవసాయంలో డ్రోన్లు వినియోగించేలా గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. డీజీసీఏ ఆథరైజ్డ్ రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అగ్రికల్చరల్ రిమోట్ పైలెట్ కోర్సును (ఏఆర్‌పీసీ) రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ యువతను గుర్తించి వారికి డ్రోన్ ఆపరేటింగ్ విధానంపై 12 రోజుల శిక్షణ ఇస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకు 23 మంది డ్రోన్ పైలెట్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 12 రోజుల వ్యవధి గల ఈ కోర్సులో డ్రోన్ ఆపరేటింగ్ చేసే విధానంపై థియరీ, ప్రాక్టికల్స్ చేయిస్తారు.
AP DSC Exam 2024: డీఎస్సీ ప్రక్రియ నిలిపివేయలేం, తేల్చి చెప్పిన హైకోర్టు
ఈ కోర్సులో చేరిన వారికి నాలుగు రోజులు థియరీ క్లాసులు, రెండు రోజులు డ్రోన్ అసెంబ్లింగ్, మరమ్మతులు, నిర్వహణ, ఆరు రోజులపాటు డ్రోన్ ఆప రేటింగ్‌పై క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తిగానే ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విద్యాలయం సర్టిఫికెట్లు ప్రదానం చేస్తోంది. ఇప్పటి వరకు తొమ్మిది బ్యాచ్‌లకు ప్రభుత్వం ఉచిత శిక్షణనిచ్చింది. కోర్సు పూర్తి చేసిన వారందరికీ 40 శాతం సబ్సిడీపై డ్రోన్లు అందజేస్తారు. రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసి రైతుల పంట పొలాలకు అవసరమైన పురుగు మందులను వారితో పిచికారీ చేస్తారు.
NEET PG 2024: షెడ్యూలు కంటే ముందుగానే 'నీట్ పీజీ-2024' ప్రవేశ పరీక్ష.. మారిన తేదీలివే
ప్రయోజనాలు ఇవీ..
వ్యవసాయ రంగంలో రాను రాను కూలీల కొరత ఏర్పడుతోంది. విద్యావకాశాలు పెరగడం వల్ల వ్యవసాయం చేసేవారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. పురుగు మందులు పిచికారీకి స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు వాడే క్రమంలో ఎంతో మంది అనారోగ్యం బారిన, కొందరు మృత్యువాత పడుతున్నారు. ఈ డ్రోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణానికి మందులు పిచికారీ చేసే అవకాశం ఏర్పడింది.
Gurukul Admissions: ‘గురుకుల’ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
డ్రోన్ వినియోగించి పురుగు మందులు పిచికారీ చేస్తే ప్రమాదాలు సంభవించవు. ఒకే సమయంలో సమీపంలోని అన్ని పంట పొలాలకు మందు పిచికారీ చేయడం వలన చీడ పీడలు నివారణ సాధ్యమైంది. ప్రస్తుతం కొందరు ప్రైవేటు వ్యక్తులు పురుగు మందులు స్ప్రే చేసేందుకు డ్రోన్లను వాడుతున్నారు. శిక్షణ పొందిన ఈ పైలెట్లు వద్ద డ్రోన్లు అందుబాటులోకి వస్తే పూర్తిగా రైతులంతా డ్రోన్ల సహాయంతోనే మందులు పిచికారీ చేయించొచ్చు.
Tags
- Farming
- drone facility
- training for youth
- technology for farmers
- AP government
- spraying pesticides
- training on drone operating
- educating youth about farming
- Education News
- Sakshi Education News
- krishna news
- Government support
- Youth empowerment
- Agriculture advancement
- Farming technology
- Drones
- Seed planting
- Harvesting
- SakshiEducationUpdates