NEET PG 2024: షెడ్యూలు కంటే ముందుగానే 'నీట్ పీజీ-2024' ప్రవేశ పరీక్ష.. మారిన తేదీలివే
లోక్‌సభ ఎన్నికల కారణంగా పలు ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే AP EAPCET,POLYCET సహా పలు పరీక్ష తేదీలను మార్చారు. తాజాగా నీట్ పీజీ పరీక్ష తేదీలను కూడా మార్చారు. దేశంలోని మెడికల్ కళాశాలల్లో పీజీకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ - పీజీ (NEET PG) పరీక్ష తేదీని అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహిస్తున్నారు.
గతంలో నీట్ పీజీ పరీక్షను జూలై 7న నిర్వహించాల్సి ఉండగా..ఇప్పుడు జూన్ 23కే ప్రీపోన్ చేస్తున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. నీట్ పీజీ ఫలితాలను జులై 15న వెల్లడించే అవకాశం ఉంది.
చదవండి: TS POLYCET 2024 Postponed: పాలీసెట్-2024 పరీక్ష వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే..
ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 5 నుంచి అక్టోబరు 15 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 16 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ప్రవేశాలు కోరేవారు అక్టోబరు 21లోగా సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
NEET PG 2024.. ముఖ్యమైన తేదీలు ఇవే
NEET PG 2024 పరీక్ష తేదీ: జూన్ 23
ఫలితాల విడుదల: జులై 15
కౌన్సిలింగ్ తేదీ: ఆగస్టు5 నుంచి అక్టోబర్ 15 వరకు
తరగతులు ప్రారంభం: సెప్టెంబర్ 16 నుంచి
కాలేజీల్లో ప్రవేశాలకు చివరి తేది: అక్టోబర్ 21