Skip to main content

TS POLYCET 2024 Postponed: పాలీసెట్-2024 పరీక్ష వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే..

తెలంగాణ‌ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్-2024) వాయిదా ప‌డింది.
Postponement Announcement    Telangana Lok Sabha Elections   POLISET-2024 Polytechnic Common Entrance Test   TS POLYCET 2024 Postponed   Secretary A. Pullaiah of State Board of Technical Education and Training

తెలంగాణ లోక్‌సభ స్థానాలకు జరిగే సాధారణ ఎన్నికల దృష్ట్యా, రాష్ట్ర వ్యాప్తంగా మే 17(శుక్రవారం) రోజున జరగాల్సిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్-2024)ను మే 24(శుక్రవారం) రోజుకు వాయిదా వేయడమైనది అని రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణా మండలి కార్యదర్శి ఎ.పుల్లయ్య మార్చి 20న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: TS/AP Polycet 2024: సత్వర ఉపాధికి మార్గం.. పాలిటెక్నిక్స్‌

Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్‌ డిప్లొమా.. భవితకు ధీమా

పదో తరగతి తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఉద్యోగం, ఉపాధి పొందాలనుకునే వారికి అందుబాటులో ఉన్న చక్కటి మార్గం.. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం పాలీసెట్‌ -2023 ప్రకటనలు విడుదలయ్యాయి. పాలీసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మూడేళ్లు, మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. టెక్నికల్‌ కోర్సులతోపాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ వంటి ప్రత్యేక డిప్లొమా కోర్సుల్లోనూ చేరొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పాలిటెక్నిక్‌ కోర్సులు, ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్‌ పరీక్ష వివరాలు..

పదోతరగతి తర్వాత విద్యార్థి వేసే ప్రతి అడుగు ఎంతో కీలకమైంది. అదే భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది. టెన్త్‌ తర్వాత పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరి పూర్తిచేసుకుంటే.. చిన్న వయసులోనే ఉద్యోగం, ఉన్నత విద్య అవకాశాలు సొంతం చేసుకునే వీలుంది. డిప్లొమాలో టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ కోర్సులుంటాయి. వీటిని పూర్తిచేసిన విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. వీరికి ప్రైవేట్‌ రంగంలోనూ అవకాశాలు విస్తృతం. పలు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా ఉద్యోగాలు లభిస్తున్నాయి.

చదవండి: Technical Education: సాంకేతిక విద్యతో బంగారు భవిత

డిప్లామా కోర్సులు

సంప్రదాయ డిప్లొమా కోర్సులతోపాటు ప్రస్తు­తం డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింVŠ , ఆర్టిఫిíషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్, కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ, వెబ్‌ డిజైనింగ్‌ తదితర కోర్సులను పలు పాలిటెక్నిక్‌ కాలేజీలు అందిస్తున్నాయి. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఇష్టమైన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాలీసెట్‌లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

టెక్నికల్‌ కోర్సులు

  • సివిల్, మెకానికల్, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్, మైనింగ్‌ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, గార్మెంట్‌ టెక్నాలజీ, హోమ్‌సైన్స్, మెటలర్జికల్, కెమికల్, సిరామిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, ఫుట్‌వేర్, ప్యాకేజింగ్, ప్రింటింగ్, లెదర్‌ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. 
  • నాన్‌ టెక్నికల్‌: తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరి కల్చర్‌ వంటి నాన్‌ టెక్నికల్‌ డిప్లొమా కోర్సుల్లో పాలీసెట్‌ ద్వారా ప్రవేశం పొందే వీలుంది.

కాలవ్యవధి

టెక్నికల్‌ కోర్సులు మూడేళ్లు లేదా మూడున్నరేళ్ల కాలవ్యవధితో అందిస్తారు. నాన్‌ టెక్నికల్‌ కోర్సులు మూడేళ్లు లేదా రెండేళ్ల కాలవ్యవధితో ఉంటాయి. సెమిస్టర్‌ విధానంలో బోధన ఉంటుంది. 
కోర్సులో భాగంగా ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌  కూడా ఉంటుంది.

అర్హతలు

పదోతరగతి లేదా తత్సమాన విద్యను మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా కనీసం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఆయా రాష్ట్రాల పాలిసెట్‌లకు దరఖాస్తుకు అర్హులు.

పాలీసెట్‌ పరీక్షలు ఇలా

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబం«ధించి పాలిసెట్‌ పరీక్షలు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు.

తెలంగాణ పాలీసెట్‌

  • తెలంగాణ పాలీసెట్‌ ద్వారా రెగ్యులర్‌ పాలిటెక్నిక్‌ కోర్సులతోపాటు అగ్రికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ, హార్టికల్చర్‌ డిప్లొమాల్లో ప్రవేశాలు పొందవచ్చు. తెలంగాణ పాలీసెట్‌లో మ్యాథ్స్‌-60, ఫిజిక్స్‌-30, కెమిస్ట్రీ-30, బయాలజీకి-30 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2గంటలు. రెగ్యులర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే వారు బయాలజీ విభాగాన్ని రాయనవసరం లేదు. అన్ని కోర్సులు లేదా ప్రత్యేకమైన కోర్సుల్లో చేరాలనుకునే వారు మాత్రమే బయాలజీ విభాగాన్ని రాయాలి.
  • తెలంగాణ పాలీసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్‌ చేస్తారు. టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీæ డిప్లొమాగా ర్యాంకులను జనరేట్‌ చేసి ప్రవేశాలను కల్పిస్తారు. 
  • టెక్నికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారి మార్కుల విధానం 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్‌-60,ఫిజిక్స్‌-30,కెమిస్ట్రీ-30 గా ఉంటాయి.
  • అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమా కోర్సుల మార్కుల విధానం కూడా 120గా ఉంటుంది. కాని ఇందులో మ్యాథ్స్‌ (60/2=30)-30, ఫిజిక్స్‌-30, కెమిస్ట్రీ-30,  బయాలజీలో 30 మార్కులుగా ఉంటాయి.

ఉన్నత విద్య

డిప్లొమా పూర్తిచేసిన అనంతరం ఉన్నత విద్య మీద ఆసక్తి ఉంటే.. ఈసెట్‌ పరీక్ష రాసి లేటరల్‌ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్‌/బీఈ రెండో సంవత్సరంలో చేరొచ్చు. ఈ విద్యార్హతతో ఎంసెట్, ఐఐటీ-జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు పోటీపడొచ్చు.

ఉద్యోగావకాశాలు

పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. రైల్వే, ఆర్మీ, గెయిల్, ఓఎన్‌జీసీ, డీఆర్‌డీఓ, బీహెచ్‌ఈఎల్‌ మహారత్న, నవరత్న, రైల్వేల్లో జేఈ పోస్టులు,  సింగరేణి సంస్థలో అవకాశాలు లభిస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వ్యవసాయం తదితరశాఖల్లో డిప్లొమా విద్యార్హతతో ఉద్యోగావకాశాలున్నాయి.

ప్రైవేట్‌ రంగం

ఈ కోర్సులను పూర్తిచేసిన అభ్యర్థులు ప్రైవేట్‌ రంగంలో కన్‌స్ట్రక్షన్, ఆటోమొబైల్, వపర్‌ప్లాంట్స్, కమ్యూనికేషన్స్, మ్యానుఫాక్చరింగ్‌ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. బీటెక్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులతో పోలిస్తే డిప్లొమా కోర్సులను పూర్తిచేసిన వారికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.  

Published date : 20 Mar 2024 05:46PM

Photo Stories