Fellowship for YUV Student: పీహెచ్‌డీ పూర్తి చేసిన వైవీయూ విద్యార్థికి ఫెలోషిప్ మంజూరు
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం జియాలజి శాఖ డీఎస్టీ ఇన్‌స్పైర్ ఫెలో పరిధిలో పీహెచ్‌డీ పూర్తి చేసిన డాక్టర్ బి. ప్రదీప్ కుమార్‌కి భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ – సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బోర్డు నేషనల్ ఫెలోషిప్ కింద పరిశోధన కోసం 30 లక్షల ఫెలోషిప్ మంజూరు చేశారు. క్లైమేట్ ఛేంజ్ ఇంపాక్ట్ ఆన్ ల్యాండ్ డీగ్రేడేషన్ అనే అంశం మీద నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సి.ఎస్.ఐ.ర్ శాస్తవేత్త డాక్టర్ సక్రం మార్గదర్శనంలో ఈయన పరిశోధనలు నిర్వహించనున్నారు.
Free Admissions: ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు.. చివరి తేదీ..!
విశ్వవిద్యాలయంలో ఆచార్య. కె. రఘుబాబు మార్గదర్శకంలో ప్రదీప్ కుమార్ ఇదివరకే పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథ రెడ్డి, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ ఆచార్య. కె. కృష్ణారెడ్డి, జియాలజీ అధ్యాపక బృందం ప్రదీప్‌కుమార్‌ను అభినందించారు.
Tags
- Fellowship
- YVU Student
- Ph.D completion
- Department of Science and Technology
- Science and Engineering Board National Fellowship
- research in Ph.D
- Yogi Vemana University
- professors
- Education News
- Sakshi Education News
- annamayya news
- Geology Department
- Yogivemana University
- National Fellowship
- Climate Change Research
- Government of India
- Geological Research
- CSIR Scientist
- SakshiEducationUpdates