Free Admissions: ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు.. చివరి తేదీ..!
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 25 శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాల వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
T20I Rankings: ‘టాప్’ ర్యాంక్‌లోనే సూర్యకుమార్ యాదవ్
ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న(అనాథలు, హెచ్‌ఐవీ బాధిత, దీర్ఘకాలిక వ్యాధులు) పిల్లలకు 5 శాతం, ఎస్సీకి 10, ఎస్టీకి 4, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు 6 శాతం సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.1.44 లక్షలు వార్షిక ఆదాయం కలిగి ఉండాలని తెలిపారు. ప్రవేశాల కోసం విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, నివాస గుర్తింపు కార్డు, విద్యార్థి జనన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని చెప్పారు.
NEET PG Exam Schedule: నీట్ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదనీ, ఉచిత విద్యనందించనున్నట్లు వివరించారు. దరఖాస్తు చేసుకునేవారు తమ నివాసానికి ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంఈఓ కార్యాలయం, సమీపంలోని మీ–సేవా, ఇంటర్నెట్ సెంటర్ల నుంచి httpr://cre.ap.gov.in/rte/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Tags
- free admissions
- School Students
- first class admissions
- last date for applications
- private schools
- free education
- seats at private schools
- Education News
- Sakshi Education News
- palnadu news
- Education
- Palnadu District
- Government initiative
- Zonal education officers
- private schools
- free education
- Unaided Schools
- sakshieducation admissions