NEET PG Exam Schedule: నీట్ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పీజీ–2024ను ఈ ఏడాది జూన్ 23న నిర్వహించనున్నారు.
ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) మార్చి 20న విడుదల చేసింది. వచ్చే జూలై 7న నీట్ పీజీ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కాగా, జూన్ 23నే పరీక్ష నిర్వ హించి, జూలై 15న ఫలితాలు ప్రకటించను న్నట్టు సవరించిన షెడ్యూల్‌లో వెల్లడించారు.
చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 15 మధ్య ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అకడమిక్ కార్యకలా పాలు ప్రారంభించనున్నారు. కళాశాలల్లో చేరికలకు అక్టోబర్ 21 చివరి గడువుగా పేర్కొన్నారు.
Published date : 21 Mar 2024 03:30PM