University Professor: రికార్డు సాధించిన ప్రొఫెసర్‌కు వర్సిటీ అధికారుల అభినందనలు..!
సాక్షి ఎడ్యుకేషన్: గత ఏడాది, అంతకుముందు ఏడాది వర్సిటీ ఆధ్వర్యంలో ఏపీ ఈఏపీసెట్ నిర్వహించారు. తాజాగా ఏపీ ఈసెట్ అప్పగించారు. ఈఏపీసెట్ బాధ్యతను జేఎన్‌టీయూ (కేకు కేటాయించారు. ఈసెట్ రాష్ట్ర చైర్మన్‌గా ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాస రావు (జేఎన్‌టీయూ ఏ వీసీ), రాష్ట్ర కన్వీనర్‌గా ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తిని నియమితులయ్యారు. ప్రొఫెసర్ భానుమూర్తి గతంలో ఈసెట్ కన్వీనర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు.
Inter Exam: ప్రశాంతంగా 'ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష'
2015 నుంచి 2021 వరకూ వరుసగా ఏడు దఫాలు జేఎన్‌టీయూ (ఏ) ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ సాగింది. 6 సార్లు కన్వీనర్‌గా భానుమూర్తి వ్యవహరించారు. తాజాగా మరో దఫా అవకాశం దక్కడంతో ఈసెట్ చరిత్రలోనే అత్యధిక సార్లు కన్వీనర్‌గా నియమితులైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా రెక్టార్ ప్రొఫెసర్ ఎం. విజయకుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శశిధర్, వర్సిటీ డైరెక్టర్లు ఆయనను అభినందించారు.