Certificate Verification : సర్టిఫికెట్ల ధ్రువీకరణలో అధికారుల తీవ్ర జాప్యం.. కోల్పోతున్న ఉద్యోగాలు!
అనంతపురం: జేఎన్‌టీయూఏ పరిధిలో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికెట్ల ధ్రువీకరణలో పరీక్షల విభాగం అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. బీటెక్ పూర్తి చేసి కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లు ఒరిజినలా? కాదా? అని ధ్రువీకరించేందుకు ఆయా కంపెనీలు థర్డ్‌పార్టీ వెరిఫికేషన్‌కు పంపుతారు. ఈ క్రమంలో థర్డ్‌పార్టీ తరపున అందిన సర్టిఫికెట్ల ధ్రువీకరణలో జాప్యం నెలకొంటోంది. దీంతో దక్కిన ఉద్యోగాలను విద్యార్థులు కోల్పోవాల్సి వస్తోంది.
వర్సిటీలో చదివినట్లు ధ్రువీకరించడంతో పాటు పాస్ అయినట్లు వర్సిటీ అధికారికంగా ఇచ్చిన సమాచారం ఆధారంగానే తొలుత కంపెనీలు ఉద్యోగంలో చేర్చుకుంటాయి. వెరిఫికేషన్‌లో ఆలస్యం జరిగి ఉద్యోగాలు కోల్పోవడం ద్వారా తాము చేయని తప్పునకు విద్యార్థులు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. జేఎన్‌టీయూఏ పరీక్షల విభాగంలో పరీక్షల విభాగం డైరెక్టర్‌తో పాటు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ముగ్గురు అడిషనల్ కంట్రోలర్లు ఉన్నారు. వాస్తవానికి ఒక అడిషనల్ కంట్రోలర్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తారు. థర్డ్‌పార్టీ వెరిఫికేషన్ మాకు వద్దు..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
అంటే మాకు వద్దు అని అడిషనల్ కంట్రోలర్లు ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ నిర్లక్ష్యం చేస్తుండడంతో సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా సర్టిఫికెట్ల ధ్రువీకరణ ఆలస్యం అవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉద్యోగాలకు ఎంపికైన తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ఈ అంశంపై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్ మాట్లాడుతూ.. సర్టిఫికెట్ల ధ్రువీకరణ ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడిషనల్ కంట్రోలర్‌కు ఈ బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Government Jobs: పల్లెల్లో సర్కారీ కొలువులపై అనాసక్తి.. ఎందుకో తెలుసా?