Inter Exam: ప్రశాంతంగా 'ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష'
ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ కోట ప్రకాశరావు, ఇంటర్‌బోర్డు జిల్లా ఆర్‌ఐఓ పి.దుర్గారావు నేతృత్వంలో డీఈసీ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించింది. అధికారులు శ్రీకాకుళం నగరంతోపాటు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పరీక్షకు మొత్తం 19,979 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 19,754 మంది పరీక్ష రాశారు. జిల్లాలోని ఆయా జూనియర్ కళాశాలల్లో అక్కడి లెక్చరర్లే ఇన్విజిలేటర్లుగా వ్యవహరించగా.. సమీపంలోని కళాశాలల లెక్చరర్లు జవాబుపత్రాలకు వాల్యుయేషన్ చేసి మార్కులు కేటాయించారు. వాటిని జ్ఞానభూమి ఆన్‌లైన్ వెబ్‌పోర్టల్‌లో ప్రిన్సిపాళ్లు అప్‌లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
చదవండి: AP Inter Practical Exam: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
23న పర్యావరణ విద్య పరీక్ష
ఫస్టియర్ విద్యార్థులకు ఈనెల 23వ తేదీన పర్యావరణ విద్య (ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్) పేరిట మరో తప్పనిసరి పరీక్ష జరగనుంది. ప్రథమ సంవత్సరం విద్యార్థులంతా ఈ పరీక్షకు విధిగా హాజరుకావడంతోపాటు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ నెల 3వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను వివిధ కారణాలతో ఇంటర్‌బోర్డు 23వ తేదీకి వాయిదా వేసింది.
ఈ పరీక్షకు గతంలో గైర్హాజరైన/ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు కూడా వారివారి కాలేజీలకు హాజరై పరీక్ష రాయవచ్చని ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారావు సూచిస్తున్నారు. ఈ రెండు తప్పనిసరి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించకుంటే పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పాస్ సర్టిఫికెట్లు జారీకావని ఆయన స్పష్టం చేశారు.
చదవండి: AP Inter 1st Year Study Material