Skip to main content

AP Inter Practical Exam: ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలో ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఉమ్మడి జిల్లాల ఆర్‌ఐఓ గురువయ్యశెట్టి అన్నారు.
AP Inter Practical Exam 2024

ఈ మేరకు శుక్రవారం నంద్యాలలో ప్రిన్సిపాళ్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన వొకేషనల్‌ విద్యార్థులకు, 11వ తేదీ నుంచి జనరల్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలో 66 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలకు సైన్స్‌ విద్యార్థులు 7,591 మంది, అలాగే వొకేషనల్‌ విద్యార్థులు 2,389 మంది హాజరు అవుతారని తెలిపారు. మార్చి 1 నుంచి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో కూడా సన్నద్ధం కావాలని తెలిపారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు 13,553 మంది, సెకండియర్‌ విద్యార్థులు 14,846 మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పబ్లిక్‌ పరీక్షలకు 52 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆర్‌ఐఓ వివరించారు.
 

చదవండి: AP Inter 1st Year Study Material

Published date : 03 Feb 2024 03:06PM

Photo Stories