Foreign Education: బ్రిటన్‌కు తగ్గుతున్న భారత విద్యార్థుల సంఖ్య.. కారణం..?
ఈ దేశ యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సులు, కోర్సుల కాల వ్యవధి, వాటికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు, గ్రాడ్యుయేట్ వీసా వంటి కారణాలతో ఎక్కువ మంది యూకే వైపు మొగ్గు చూపుతున్నారు. కాని యూకే ప్రభుత్వం ఇటీవల గ్రాడ్యుయేట్ వీసా పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ఇక యూకేలో ఉన్నత విద్య ఆశలకు ఫుల్‌స్టాప్ పెట్టుకోవాల్సిందేనా! అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. యూకే గ్రాడ్యుయేట్ వీసా విధానం, భారతీయ విద్యార్థులకు ప్రయోజనాలు తదితర వివరాలు..
విదేశీ విద్య విద్యార్థులను ఆకట్టుకునే ఉద్దేశంతో యూకే ప్రభుత్వం 2021లో గ్రాడ్యుయేట్ రూట్ వీసా పేరుతో.. కొత్త వీసా విధానానికి రూపకల్పన చేసింది. దీని ప్రకారం–ఆ దేశ యూనివర్సిటీల్లో బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. మరికొంతకాలం యూకేలోనే ఉండి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు పొందొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సుల విద్యార్థులు రెండేళ్లు, పీహెచ్‌డీ అభ్యర్థులు మూడేళ్లపాటు పోస్ట్ స్టడీ వర్క్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వీసా మంజూరైతే.. జాబ్ ఆఫర్ లెటర్ లేకపోయినా.. అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ చేయొచ్చు. కొలువు లభిస్తే గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి ముగిశాక.. స్కిల్డ్ వర్కర్ వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా స్కిల్డ్ వర్కర్ వీసా మంజూరైతే.. యూకేలోనే మరింత కాలం ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది.
AP LAWCET 2024: ఏపీ లాసెట్ హాల్‌టికెట్స్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
రద్దు ప్రయత్నాలు
ఇప్పటికే పలు రకాల వీసాల విషయంలో కఠిన నిబంధనలను తెచ్చిన యూకే ప్రభుత్వం.. గ్రాడ్యుయేట్ వీసాపైనా దృష్టి పెట్టింది. ఈ విధానం ద్వారా వస్తున్న విదేశీ విద్యార్థుల కారణంగా దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నట్లు బ్రిటన్ సర్కారు భావిస్తోంది. దీంతో మూడేళ్ల క్రితం ప్రారంభించిన గ్రాడ్యుయేట్ వీసా స్కీమ్‌ను రద్దు చేయనున్నారనే వార్తలు వచ్చాయి.
ఇంకా సమీక్ష దశలోనే
యూకే గ్రాడ్యుయేట్ వీసా రద్దు చేయనుందనే వార్తలపై ఆ దేశ ప్రభుత్వం తాజాగా స్పందించింది. వీసా రద్దు ప్రతిపాదన ఇంకా సమీక్ష దశలోనే ఉందని తెలిపింది. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ వీసాను ప్రస్తుత రూపంలోనే కొనసాగించాలని ‘ద యూకే మైగ్రేషన్ కమిటీ’ ఇటీవల సిఫార్సు చేసింది. దీంతో.. ఇప్పటికే అక్కడ చదువుతున్న భారత విద్యార్థులకు, అదేవిధంగా ఈ అకడమిక్ సంవత్సరంలో అడుగుపెడుతున్న విదేశీ విద్యార్థులకు గ్రాడ్యుయేట్ రూట్ వీసా పొందే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Project Associate Posts: టీహెచ్‌ఎస్‌టీఐలో ప్రాజెక్టు అసోసియేట్ పోస్టులు..
మన విద్యార్థులకు ప్రతికూలం
యూకే ప్రభుత్వం గ్రాడ్యుయేట్ రూట్ వీసాను రద్దు చేస్తే.. భారత విద్యార్థులపైనే ఎక్కువ ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. యూకేలో.. యూజీ, పీజీ, పీహెచ్‌డీల కోసం అడుగు పెడుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత విద్యార్థులే 80 శాతం మేరకు ఉంటున్నారు. ఇప్పటికే ఇతర వీసాల్లో నిబంధనల కారణంగా భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్.. డిపెండెంట్స్‌ను తీసుకురాకూడదనే నిబంధనతో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు.
గ్రాడ్యుయేట్ వీసా.. అర్హతలు
విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే నాటికి యూకేలో ఉండాలి. ప్రస్తుతం స్టూడెంట్ వీసా లేదా విద్యాభ్యాసం కోసం ఇచ్చే టైర్–4 జనరల్ వీసా కలిగుండాలి. యూకే విద్యా విధానం నిబంధనల ప్రకారం–నిర్దేశించిన కనీస కాలపరిమితితో ఆయా కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ఉదాహరణకు పీజీని కనీసం 12 నెలల వ్యవధిలో స్టూడెంట్ వీసా లేదా, టైర్–4 జనరల్ వీసా ద్వారా చదివుండాలి.
NEET 2024: నీట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి.. ఫలితాలను విడుదల చేసిన ఎన్టీఏ
స్టూడెంట్ వీసా ముగిసేలోపే
గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకుని పోస్ట్ స్టడీ వర్క్ అవకాశం పొందాలనుకునే విద్యార్థులు.. తమ స్టూడెంట్ వీసా లేదా టైర్–4 జనరల్ వీసా కాలపరిమితి ముగిసేలోపే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు తమ కోర్సులకు సంబంధించి సర్టిఫికెట్లు పొందకముందే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం తాము కోర్సులు చదివిన ఇన్‌స్టిట్యూట్ లేదా కాలేజ్‌ల నుంచి కోర్సు పూర్తి చేసుకున్నట్లు ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది. అవి.. పాస్ట్‌పోర్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, స్కాలర్‌షిప్ లేదా స్పాన్సర్‌షిప్ ప్రొవైడర్ నుంచి ధ్రువీకరణ పత్రం, కోర్సు ప్రవేశ సమయంలో ఇచ్చే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ (సీఏఎస్) రిఫరెన్స్ నెంబర్, బయో మెట్రికల్ రెసిడెన్స్ పర్మిట్‌లను సిద్ధంగా ఉంచుకోవాలి. పీహెచ్‌డీ విద్యార్థులకు అకడమిక్ టెక్నాలజీ అప్రూవల్ స్కీమ్ సర్టిఫికెట్ కూడా అవసరం.
Jobs at CTRI: సీటీఆర్‌ఐలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు..
ఎనిమిది వారాల్లో నిర్ణయం
ఆన్‌లైన్‌లో గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకున్నాక.. సదరు దరఖాస్తును పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడానికి గరిష్టంగా ఎనిమిది వారాల సమయం పడుతుందని యూకే ఇమిగ్రేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తుకు ఆమోదం లభిస్తే.. ఈ–మెయిల్ లేదా యూకే ఇమిగ్రేషన్ పోర్టల్‌లో దానికి సంబంధించిన ధ్రువీకరణను తెలుసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ వీసా.. ప్రయోజనాలు
గ్రాడ్యుయేట్ వీసాతో విదేశీ విద్యార్థులకు పలు ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కోర్సు పూర్తయ్యాక అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసుకునే వీలుంది. దీంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలు, స్వచ్ఛంద సేవ చేయడం, గ్రాడ్యుయేట్ వీసా కాల పరిమితి సమయంలో యూకే నుంచి స్వదేశానికి లేదా ఇతర దేశాలకు వెళ్లి, మళ్లీ యూకేకు తిరిగిరావచ్చు. ఈ విధానంతో విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకుని.. ఆ వీసా కాల పరిమితి సమయంలో అక్కడే ఉండి ఉద్యోగం సొంతం చేసుకుని పర్మనెంట్ రెసిడెన్సీ పొందొచ్చు.
ఉన్నత విద్య
యూకే ఉన్నత విద్యకు సంబంధించి భారత విద్యార్థులకు ప్రధానంగా కలిసొచ్చే అంశం.. మాస్టర్స్ డిగ్రీ (పీజీ)ని ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసుకునే అవకాశం ఉండటం. ఈ కోర్సులను భారత్‌లోని రెండేళ్ల పీజీ కోర్సులకు తత్సమాన అర్హతగా గుర్తిస్తున్నారు. ఏడాది వ్యవధిలోనే పీజీ పూర్తి చేసుకోవచ్చనే ఉద్దేశంతో మన విద్యార్థులు యూకేకు పయనమవుతున్నారు. దీంతోపాటు ఇతర దేశాలతో పోల్చుకుంటే యూకేలో అకడమిక్ వ్యయాలు కొంత తక్కువగా ఉండడం కూడా కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.
NIN Job Notification: ఎన్‌ఐఎన్‌లో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
టైర్–4కు ఆదరణ ఎక్కువ
గ్రాడ్యుయేట్ రూట్ వీసాతో పాటు పలు రకాల వీసాలు యూకేలో అందుబాటులో ఉన్నాయి. వీటిని టైర్ –1 నుంచి టైర్– 6గా వర్గీకరించారు. విదేశీ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఇచ్చే టైర్–4 వీసాకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. యూకేలో ఉద్యోగం కోస టైర్–2 వీసాలను మంజూరు చేస్తున్నారు. ఉద్యోగం పొందిన అభ్యర్థులు.. జాబ్ ఇచ్చిన యాజమాన్యం నుంచి స్పాన్సర్‌షిప్ లెటర్‌ను అందించాల్సి ఉంటుంది. అక్కడే టైర్–2 కేటగిరీ వీసాతో విద్యను అభ్యసించి పోస్ట్ స్టడీ వర్క్ ఉద్యోగాన్వేషణ సాగిస్తూ.. ఉద్యోగం సొంతం చేసుకున్న విద్యార్థులు తమ టైర్–2 వీసాను టైర్–4 వీసాగానూ మార్చుకునే అవకాశం ఉంది.
టైర్–5.. టెంపరరీ వర్క్ వీసా
యూకే అందిస్తున్న వీసాల్లో మరో ముఖ్యమైన వీసా.. టైర్–5 టెంపరరీ వర్క్ వీసా. వేరే దేశంలో ప్రధాన కార్యాలయం ఉండి..యూకేలో క్లయింట్లను కలిగి ఉన్న సంస్థలు.. యూకేలోని ఆ క్లయింట్ల కార్యాలయంలో కొద్ది కాలం పాటు పని చేసే అవకాశం కల్పిస్తూ.. టైర్–5 వీసా మంజూరు చేస్తారు.
AP Election Results: ఏపీలో భారీ విజయం సాధించిన ఎన్డీఏ కూటమి.. ఈ పార్టీలు గెలిచిన ఎంపీ స్థానాలు ఇవే..
వినూత్న కోర్సులు
వినూత్న కోర్సులకు నెలవుగా యూకేను పేర్కొనొచ్చు. వీటిని ప్రధానంగా నాలుగు విభాగాలుగా వర్గీకరించొచ్చు. అవి.. ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్; ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ; నేచురల్ సైన్సెస్; మెడికల్ సైన్సెస్. యూకే యూనివర్సిటీలకు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సులను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్(ఎల్‌ఎస్‌ఈ), యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్), ద యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్‌బర్గ్‌లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.
గ్రాడ్యుయేట్ రూట్ వీసా..ముఖ్యాంశాలు
- 2021, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన గ్రాడ్యుయేట్ వీసా విధానం.
- బ్యాచిలర్, పీజీ విద్యార్థులు రెండేళ్లు, పీహెచ్‌డీ అభ్యర్థులు మూడేళ్లు అక్కడే ఉండి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు అన్వేషించుకునే అవకాశం.
- ఉద్యోగం సొంతం చేసుకున్నాక.. వర్క్ వీసాకు బదిలీ చేసుకునే అవకాశం.
- కోర్సుల సర్టిఫికెట్లు రాకముందే గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు.
IGNOU Admissions: ఇగ్నోలో ప్రవేశానికి జూలై సెషన్ 2024–25కు నోటిఫికేషన్ విడుదల