Skip to main content

IGNOU Admissions: ఇగ్నోలో ప్ర‌వేశానికి జూలై సెషన్‌ 2024–25కు నోటిఫికేషన్‌ విడుదల

ఇగ్నోలో విద్యార్థులకు అందించే వివిధ కోర్సుల్లో శిక్ష‌ణ, నాణ్య‌త గురించి వివ‌ర‌ణ‌..
Apply Now for Various Courses at IGNOU  IGNOU Admission Notification Released for July Session 2024-25  IGNOU Admissions Open for July 2024-25 Session

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది.. ఇగ్నో(ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం). ఈ యూనివర్సిటీ అందించే వైవిధ్యమైన కోర్సులు, నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ కారణంగా విద్యార్థులు ఇగ్నో కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా జూలై సెషన్‌ 2024–25కు సంబంధించి యూజీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఇగ్నో ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఇగ్నో అందించే కోర్సులపై ప్రత్యేక సమాచారం..

ఇగ్నో ప్రత్యేకత
రెగ్యులర్‌ విధానంలో అందుబాటులో లేని కోర్సులను సైతం దూర విద్యవిధానంలో అందించడం ఇగ్నో ప్రత్యేకత. తక్కువ విద్యార్హతలు ఉన్నవారికీ, వృత్తి నిపుణులకూ, ఉన్నత విద్యను కోరుకునేవారికీ, స్వయం ఉపాధి ఆశించేవారికి ఉపయోగపడేలా భిన్నమైన కోర్సులను ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది.

Job Notification: ఐఐటీఎంలో ప్రాజెక్ట్‌ పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల

అందించే కోర్సులు
సర్టిఫికేట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికేట్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయిల్లో చాలా విభాగాల్లో కోర్సులు అందిస్తోంది. ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, సోషల్‌ సైన్సెస్‌లే కాకుండా.. మెడిసిన్, న్యూట్రిషన్, నర్సింగ్, అగ్రికల్చరల్, లా.. ఇలా వివిధ విభాగాలకు సంబంధించిన కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. 

తెలుగు కోర్సులు
పౌల్ట్రీ, డెయిరీ ఫార్మింగ్‌ కోర్సులను తెలుగు మాధ్యమంలోనూ అందిస్తున్నారు. ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, మార్కెటింగ్‌ నిపుణులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్, టూర్‌ ప్లానర్స్, అకౌంటెంట్స్‌.. ఇలా అన్ని వృత్తులు, రంగాల వారికి ఉపయోగపడే కోర్సులు వివిధ స్థాయిల్లో అందుబాటులో ఉన్నాయి. విదేశీ భాషలు, ఇంగ్లిష్‌ నైపుణ్యాలు, రచనలో సృజనాత్మకతకు మెరుగులద్దే కోర్సులను కూడా ఇగ్నో నిర్వహిస్తోంది.

యూజీ స్థాయి కోర్సులు
బీఏ టూరిజం స్టడీస్, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీఎల్‌ఐఎస్‌సీ, ప్రిపరేటరీ ప్రోగ్రామ్‌ ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌(టూరిజం మేనేజ్‌మెంట్‌) కోర్సులను ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం(సీబీసీఎస్‌) విధానంలో అందిస్తోంది.
సీబీసీఎస్‌ ఆనర్స్‌ విధానంలో.. బీఏ–ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఇంగ్లిష్‌ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఆనర్స్‌ విధానంలో బీఎస్సీ బయోకెమిస్ట్రీ, బీబీఏ రిటైలింగ్‌ అందుబాటులో ఉన్నాయి. 

JEE Advanced 2024: 9న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు.. రెస్పాన్స్‌ షీట్‌ మాత్రం ఈ రోజే..

పీజీ ప్రోగ్రామ్స్‌
ఎంఏ రూరల్‌ డెవలప్‌మెంట్, ఇంగ్లిష్, హిందీ, ఫిలాసఫీ, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్, సైకాలజీ, అంత్రోపాలజీ, డెవలప్‌మెంట్‌ స్టడీస్, జండర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్, మాస్టర్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌(కౌన్సెలింగ్‌), మా­స్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్, మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ కోర్సులను ఇగ్నో అందిస్తోంది. 

పీజీ డిప్లొమా
లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, గాంధీ అండ్‌ స్టడీస్, రూరల్‌ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌లేషన్, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ ఆపరేషన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్, అనలిటికల్‌ కెమిస్ట్రీ, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ ఆడియో ప్రోగ్రామ్‌ ప్రొడక్షన్, హయ్యర్‌ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, స్కూల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఫార్మాస్యూటికల్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్, క్రిమినల్‌ జస్టిస్, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఫోక్‌లోర్‌ అండ్‌ కల్చర్‌ స్టడీస్, సస్టెయినబిలిటీ సైన్స్, సోషల్‌ వర్క్‌ కౌన్సెలింగ్, డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

NEET 2024: ‘నీట్‌’ పరీక్షలో ఆలిండియా టాపర్స్‌.. ఈసారి కటాఫ్‌ మార్కులు పెరగడంతో

డిప్లొమా కోర్సులు
అర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్, పంచాయత్‌ లెవల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్, టూరిజం స్టడీస్, ఆక్వాకల్చర్, క్రియేటివ్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్, ఉర్దూ, హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌–ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, ఉమెన్స్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్, పారా లీగల్‌ ప్రాక్టీస్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో నచ్చిన వాటిలో చేరవచ్చు.

సర్టిఫికేట్‌ కోర్సులు
పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్, థియేటర్‌ ఆర్ట్స్, హిందూస్థానీ మ్యూజిక్, కర్ణాటిక్‌ మ్యూజిక్, భరతనాట్యం, అరబిక్‌ లాంగ్వేజ్, ఫ్రెంచ్‌ లాంగ్వేజ్, రష్యన్‌ లాంగ్వేజ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, ఎన్జీవో మేనేజ్‌మెంట్, బిజినెస్‌ స్కిల్స్, టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యూజ్‌ సెకండ్‌ లాంగ్వేజ్, ఫంక్షనల్‌ ఇంగ్లిష్, ఉర్దూ లాంగ్వేజ్, హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, సోషల్‌ వర్క్‌ అండ్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్, సోషల్‌ వర్క్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, న్యూ బోర్న్‌ అండ్‌ ఇన్‌ఫాంట్‌ నర్సింగ్, మాటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్, హోంబేస్‌డ హెల్త్‌కేర్, కమ్యూనిటీ రేడియో, టూరిజం స్టడీస్, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, న్యూట్రిషన్‌ అండ్‌ చైల్డ్‌కేర్, రూరల్‌ డెవలప్‌మెంట్, సెరీ కల్చర్, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌.

TS ICET 2024: నేడే టీఎస్‌ ఐసెట్‌ ప్రవేశ పరీక్ష.. రేపటి షెడ్యూల్‌ ఇదే

అర్హతలు
కోర్సులను అనుసరించి 8వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ, 10+2, బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

కోర్సు కాలవ్యవధి
అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల కాలవ్యవధి మూడు లేదా నాలుగేళ్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ –రెండేళ్లు, పీజీ డిప్లొమా/డిప్లొమా–ఏడాది, పీజీ సర్టిఫికేట్‌/సర్టిఫికేట్‌–6 నెలలు, అవేర్‌నెస్‌– 2/3 నెలలు.

ముఖ్యసమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.06.2024
»    వెబ్‌సైట్‌: http://ignou.ac.in

IIM Notification: నవంబర్‌ 24న క్యాట్‌–2024.. వ‌చ్చే నెల‌లో నోటిఫికేష‌న్‌!

Published date : 05 Jun 2024 12:45PM

Photo Stories