Job Notification: ఐఐటీఎంలో ప్రాజెక్ట్ పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల

సాక్షి ఎడ్యుకేషన్:
పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటిరియోలజీ(ఐఐటీఎం).. ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన 65 ప్రాజెక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్హతలు, నెట్/సీఎస్‌ఐఆర్–యూజీసీ/గేట్ స్కోర్ , ఉద్యోగానుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» మొత్తం పోస్టులు: 65
» పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్, ట్రైనింగ్ కో-ఆర్డినేటర్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్(డీప్ ఓషియన్ మిషన్).
» అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహె చ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు నెట్/సీఎస్‌ఐఆర్–యూజీసీ/గేట్ స్కోరుతో పాటు పని అనుభవం అవసరం.
» ప్రాజెక్ట్ సైంటిస్ట్–3: మెటిరియాలజీ/ఓషనోగ్రఫీ/అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ఎర్త్ సైన్సెస్/క్లైమేట్ సైన్సెస్/ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. గరిష్ట వయసు 45 ఏళ్లు మించకూడదు. ఏడేళ్ల పరిశోధన అనుభవం ఉండాలి. మోడల్ కోడ్ హ్యాండ్లింగ్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. అనుభవాన్ని సైంటిఫిక్ రిపోర్ట్స్ /పబ్లికేషన్స్ ఆధారంగా పరిగణిస్తారు.
JEE Advanced 2024: 9న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు.. రెస్పాన్స్ షీట్ మాత్రం ఈ రోజే..
» ప్రాజెక్ట్ సైంటిస్ట్–2: ఫిజిక్స్/జియాలజీ/ఎర్త్ సైన్స్/జియోఫిజిక్స్/అనలిటికల్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. గరిష్ట వయసు 40 ఏళ్లు మించకూడదు. ఎంఎస్–ఆఫీస్ పరిజ్ఞానం, మూడేళ్ల పని అనుభవం ఉండాలి. జియో కెమికల్ అనలిటికల్ టెక్నిక్స్, అనలిటికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ నిర్వహణ తెలిసినవారికి ప్రాధాన్యమిస్తారు.
» ప్రాజెక్ట్ సైంటిస్ట్–1: ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/అట్మాస్ఫియరిక్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఈఈఈ/ఈ అండ్ టీలో ఇంజనీరింగ్ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. గరిష్ట వయసు 35 ఏళ్లు మించకూడదు. సైన్స్‌లో డాక్టోరల్ డిగ్రీ/ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసినవారికి, సంబంధిత ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
» ట్రైయినింగ్ కోఆర్టినేటర్–1: మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి గవర్నమెంట్/సీఎస్‌యూల్లో నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ట వయసు 40 ఏళ్లు ఉండాలి. అలాగే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/పర్సనల్ మేనేజ్‌మెంట్/లేబర్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేసినవారికి, సూపర్‌వైజర్ స్థాయిలో మూడేళ్లు పనిచేసినవారికి, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, వర్క్‌షాపులు, సమావేశాలను సమన్వయం చేసినవారికి ప్రాధాన్యమిస్తారు.
» సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: ఫిజిక్స్/మెటిరియాలజీ/అట్మాస్ఫియరిక్ సైన్సెలో ఎమ్మెస్సీ/ఎంటెక్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. గరిష్ట వయసు 40 ఏళ్లు ఉండాలి. ఇండస్ట్రియల్/అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్/సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్స్‌లోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. అట్మాస్ఫియరిక్ ఇన్‌స్ట్రుమెంట్స్, డేటా అక్విజిషన్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారికి ప్రా«ధాన్యం ఇస్తారు.
» ప్రాజెక్ట్ అసోసియేట్ –2: ఫిజిక్స్/మ్యాథమెటిక్స్/మెటియోరాలజీ/ఓషనోగ్రఫీ/అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ఎర్త్ సైన్సెస్/క్లైమేట్ సైన్సెస్/స్టాటిస్టిక్స్‌లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. గరిష్ట వయసు 35 ఏళ్లు ఉండాలి. అలాగే ఎర్త్ సిస్టమ్ మోడలింగ్/క్లైమేట్ మోడలింగ్‌లో రెండేళ్ల పరిశోధనాభవం ఉండాలి. సైంటిఫిక్ రిపోర్ట్స్/పబ్లికేషన్స్ ఆధారంగా అనుభవాన్ని పరిగణిస్తారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పరిజ్ఞానం ఉండి.. ప్రముఖ సంస్థల్లో పనిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
» ప్రాజెక్ట్ అసోసియేట్ –1: ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్/అట్మాస్ఫియరిక్ సైన్సెస్/మెటియరాలజీ,ఓషనోగ్రఫీ/క్లైమేట్ సైన్స్/జియోఫిజిక్స్/ఎన్విరాన్‌మెంటల్ సైన్సెలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
» రీసెర్చ్ అసోసియేట్(డీప్ ఓషన్ మిషన్)–2: మెటియరాలజీ/అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ఎర్త్ సైన్సెస్/క్లైమేట్ సైన్సెస్/ఓషనోగ్రఫీ /ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్/మ్యాథమెటిక్స్‌లో డాక్టరేట్ డిగ్రీ ఉండాలి. లేదా ఎంటెక్ చదివిన తర్వాత మూడేళ్ల పరిశోధన అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 35 ఏళ్లు. సైంటిఫిక్ రిపోర్ట్స్/పబ్లికేషన్స్ ఆధారంగా అనుభవాన్ని పరిగణిస్తారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఏఐ/ఎంఎల్ టెక్నిక్స్‌లో అనుభవం ఉండాలి.
ముఖ్యసమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.06.2024
» వెబ్‌సైట్: https://www.tropmet.res.in
NEET 2024: ‘నీట్’ పరీక్షలో ఆలిండియా టాపర్స్.. ఈసారి కటాఫ్ మార్కులు పెరగడంతో
Tags
- IITM Pune
- Job Notification
- online applications
- Indian Institute of Tropical Meteorology
- IITM Recruitments 2024
- eligible candidates for IITM
- job offers
- Project Posts
- contract based jobs
- Education News
- Sakshi Education News
- IITM Recruitment 2024
- IITM Pune Jobs
- IITM Project Posts
- Contractual Jobs IITM
- Meteorology Jobs India
- IITM Job Application
- Apply Online IITM
- GATE Score Jobs
- CSIR-UGC Qualified Jobs
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications