IIM Notification: నవంబర్ 24న క్యాట్–2024.. వచ్చే నెలలో నోటిఫికేషన్!
అందుకే ఐఐఎంల్లో చేరితే ఉజ్వల కార్పొరేట్ కెరీర్ ఖాయమైనట్లేనని భావిస్తారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)!! దేశంలో అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో ఒకటిగా భావించే క్యాట్.. ఈ ఏడాది నవంబర్ 24న జరుగనుంది. ఈ నేపథ్యంలో.. క్యాట్ ప్రత్యేకత, పరీక్ష విధానం, సిలబస్, ఐఐఎంల మలిదశ ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు..
మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థుల్లో అధిక శాతం మంది లక్ష్యం.. ఐఐఎంలు. వీటిల్లో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్‌లో విజయం సాధించాలని డిగ్రీ స్థాయి కోర్సుల ఫైనల్‌లో ఉండగానే ప్రిపరేషన్స్ ప్రారంభిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 ఐఐఎం క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిల్లో ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, పీహెచ్‌డీ(ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్) కోర్సులను అందిస్తున్నారు. గత ఏడాది వరకు 20 ఐఐఎం క్యాంపస్‌లనే పేర్కొనగా.. ముంబైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (ఎన్‌ఐటీఐఈ)కు తాజాగా ఐఐఎం హోదా లభించింది. దీంతో క్యాట్ 2024 ద్వారా ప్రవేశాలు కల్పించే ఐఐఎంల సంఖ్య 21కు పెరిగింది. వీటిల్లో దాదాపు అయిదు వేల సీట్లు ఉన్నాయి.
Comviva CEO: టెక్ మహీంద్రా కంపెనీ ‘కామ్‌వివా’కి కొత్త సీఈవో
క్యాట్‌తో ఐఐటీల్లోనూ ప్రవేశం
క్యాట్ స్కోర్‌తో ఐఐఎంలే కాకుండా.. ఇంజనీరింగ్ విద్యను అందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఐఐటీల్లోనూ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరే అవకాశముంది. వీటితోపాటు దేశంలోని పలు ఇతర ఇన్‌స్టిట్యూట్స్ సైతం క్యాట్ స్కోర్ ఆధారంగా మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
రెండు లక్షలకు పైగా పోటీ
క్యాట్‌ను ప్రతి ఏటా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దీనికి రెండు లక్షల మందికిపైగా పోటీ పడుతున్నారు. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. క్యాట్–2023కు 2.8 లక్షల మంది; క్యాట్–2022కు 2.22 లక్షల మంది; క్యాట్–2021కు 1.91 లక్షల మంది హాజరయ్యారు.
IIIT Intergrated B Tech Admissions: బాసరలో ట్రిపుల్‌ఐటీ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు..
అర్హతలు
కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు) ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది.
మూడు విభాగాల్లో పరీక్ష
క్యాట్–2024 తేదీపై స్పష్టత వచ్చింది. దీంతో క్యాట్ పరీక్ష విధానంలో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా అనే సందేహం అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. సాధారణంగా క్యాట్ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో జరుగుతుంది. విభాగం–1లో వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్; విభాగం–2లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, విభాగం–3లో క్వాంటిటేటివ్ ఎబిలిటీలపై ప్రశ్నలు అడుగుతారు.
Comviva CEO: టెక్ మహీంద్రా కంపెనీ ‘కామ్‌వివా’కి కొత్త సీఈవో
విభాగాల వారీగా ప్రశ్నల సంఖ్య
క్యాట్–2023లో వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 24 ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 22 ప్రశ్నలు చొప్పున మొత్తం 66 ప్రశ్నలతో.. 198 మార్కులకు పరీక్ష నిర్వహించారు. క్యాట్–2024 పరీక్ష కూడా ఇదే విధానంలో జరుగుతుందని, పెద్దగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాత పరీక్షలో బెస్ట్ స్కోర్‌ఇలా
వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్
ఈ విభాగంలో స్కోర్ కోసం ఇంగ్లిష్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ గ్రామర్‌పై దృష్టిపెట్టాలి. యాంటానిమ్స్, సినానిమ్స్, బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా ఫ్యాక్ట్స్, ఇన్ఫరెన్సెస్, జంబుల్డ్ పారాగ్రాఫ్స్‌లను ప్రాక్టీస్ చేయాలి. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడిగే రీడింగ్ కాంప్రహెన్షన్‌లో రాణించేందుకు అసెంప్షన్, స్టేట్‌మెంట్స్‌పై పట్టు సాధించాలి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్
క్యాట్‌లో డీఐఎల్‌ఆర్‌గా పేర్కొనే ఈ విభాగంలో రాణించేందుకు విశ్లేషణాత్మక నైపుణ్యం, తార్కిక విశ్లేషణ పెంచుకోవాలి. టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. లాజికల్ రీజనింగ్‌లో క్యూబ్స్, క్లాక్స్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
TSPSC Group I Exam: గ్రూప్–1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ.. ఈ పరీక్ష ఉన్నందున వాయిదా వేయాలన్న పిటిషనర్లు!
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
మ్యాథమెటికల్, అర్థమెటికల్ స్కిల్స్‌ను పరీక్షించే విభాగం ఇది. ఇందులో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలంటే.. అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, రేషియోస్, టైం–డిస్టెన్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అల్‌జీబ్రా, మోడ్రన్ మ్యాథ్స్, జామెట్రీలపై దృష్టిపెట్టాలి.
కటాఫ్ పర్సంటైల్
క్యాట్‌లో ప్రతి సెక్షన్‌లోనూ నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందేలా కృషి చేయాలి. ఎందుకంటే.. ఐఐఎంలు మలి దశ ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులను పిలిచేందుకు ఓవరాల్ కటాఫ్‌తోపాటు సెక్షనల్ కటాఫ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఓవరాల్ కటాఫ్ కనిష్టంగా 85, గరిష్టంగా 90 పర్సంటైల్ సాధించాలి. అదే విధంగా సెక్షనల్ కటాఫ్ 75 నుంచి 80 పర్సంటైల్ కోసం కృషి చేయాలి.
UG and PG Admissions: నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
కాన్సెప్ట్స్, ప్రాక్టీస్
క్యాట్ అభ్యర్థులు తొలుత సిలబస్‌ను, గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. పరీక్ష విధానంపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక మెటీరియల్ ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. దీంతోపాటు ప్రతి టాపిక్ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం ఎంతో మేలు చేస్తుంది. క్యాట్ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు..ఎక్కువ వెయిటేజీ ఉన్న అంశాలను పరిశీలించి వాటిపై దృష్టి సారించాలి. ప్రతి యూనిట్ తర్వాత ఉండే మోడల్ కొశ్చన్స్‌ను సాధన చేయాలి.
నమూనా, మోడల్ టెస్ట్‌లు
క్యాట్ అభ్యర్థులు మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరుకావడం మేలు చేస్తుంది. మాక్ టెస్టులకు హాజరై.. వాటి ఫలితాలను విశ్లేషించుకోవాలి. తద్వారా తాము ఇంకా పట్టు సాధించాల్సిన టాపిక్స్ గుర్తించి, వాటిపై ఫోకస్ పెట్టాలి. ఇలా ఒకవైపు సబ్జెక్ట్ ప్రిపరేషన్ సాగిస్తూనే.. మరోవైపు నిరంతరం తమ ప్రతిభను పరీక్షించుకుంటూ.. నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి.
మలి దశకు సన్నద్ధత
ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి.. మలిదశలో గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. వీటికి నిర్దిష్ట వెయిటేజీ కేటాయించే విధానాన్ని అనుసరిస్తున్నాయి. తుది విజేతల ఎంపికలో క్యాట్ స్కోర్‌కు 50 నుంచి 70 శాతం, జీడీ/పీఐలకు 30 నుంచి 50 శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి. కాబట్టి క్యాట్‌లో బెస్ట్ స్కోర్ కోసం ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు.. మలిదశ ఎంపిక ప్రక్రియపైనా ఇప్పటి నుంచే అవగాహన పెంచుకోవాలి. ఇందులో రాణించేందుకు సమాంతరంగా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
NIT: నిట్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
జీడీ, పీఐ
మలిదశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్స్(జీడీ)లో అభ్యర్థులను పలు బృందాలుగా విభజించి.. ఒక్కో బృందానికి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దానిపై మాట్లాడమంటారు. ఒక్కో బృందంలో ఎనిమిది నుంచి పది మంది అభ్యర్థులు ఉంటున్నారు. జీడీ సమయంలోనే కొన్ని ఐఐఎంలు రిటెన్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తున్నాయి. ఈ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక టాపిక్‌పై తమ అభిప్రాయాలను పద పరిమితితో రాయాలని కోరుతున్నారు. ఈ రెండు దశల్లోనూ విజయం సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ సమయంలో మేనేజ్‌మెంట్ కోర్సులో చేరడానికి కారణాలు.. భవిష్యత్తు లక్ష్యాలు, ఆసక్తులు తదితర ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యర్థులు ఇప్పటి నుంచి తొలి, మలి దశ ఎంపిక ప్రక్రియపై అవగాహన పెంచుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తే విజేతలుగా నిలిచే అవకాశం ఉంటుంది.
Ph.D at NIT: నిట్ రూర్కెలాలో పీహెచ్‌డీ ప్రవేశానికి దరఖాస్తులు..
Tags
- Indian Institute of Management
- admissions
- Common Entrance Test
- notification
- CAT Exam
- IIT entrance test
- IIM Admissions
- CAT preparations
- Eligible students
- best score way in cat exam
- Education News
- Sakshi Education News
- Common Admission Test
- IIM Admissions
- Indian Institutes of Management
- CAT syllabus
- CAT Exam Pattern
- CAT selection process
- CAT mock test
- CAT Results
- Personal interview IIM
- MBA entrance exam