TSPSC Group I Exam: గ్రూప్–1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ.. ఈ పరీక్ష ఉన్నందున వాయిదా వేయాలన్న పిటిషనర్లు!
అయితే పిటిషనర్లు జూన్ 1న ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు స్పష్టం చేసింది. పిటిషన్‌లో విచారణను ముగించింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్‌మెంట్ పరిధిలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్– ఐఐ/ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 2వ స్క్రీనింగ్ టెస్ట్ జూన్ 9న ఉందని, అదేరోజు నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ ఎం.గణేశ్, భూక్యా భరత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ జూన్ 4న విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ..‘గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి షెడ్యూల్ ముందుగానే ప్రకటించాం. 9న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
వారందరూ పరీక్షకు సిద్ధమయ్యారు. కొందరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం...పరీక్ష వాయిదా వేయడం సాధ్యం కాదు. అయినా పిటిషనర్ల వినతిపత్రంపై అధికారులు చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటారు’అని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి...ఈ పిటిషన్‌లో మెరిట్స్‌లోకి వెళ్లడంలేదని, చట్టప్రకారం టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.
Tags
- High Court
- tspsc group 1 prelims exam pattern
- TSPSC
- Intelligence Bureau Department Exam
- Assistant Central Intelligence Officer Grade – II/Executive Post
- Telangana News
- TSPSC Study Material
- TSPSC Group 1
- Hyderabad High Court
- group-1 prelims
- Intelligence Bureau exam
- June 9 schedule
- Petitioners' plea
- SakshiEducationUpdates