Skip to main content

AP Election Results: ఏపీలో భారీ విజ‌యం సాధించిన ఎన్డీఏ కూటమి

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మి భారీ విజ‌యాన్ని సాధించింది.
Andhra Pradesh Election Results 2024  Victory in AP Elections  NDA alliance wins 164 out of 175 seats

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల్లో ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 144 సీట్లలో పోటీ చేయ‌గా 135 స్థానాల్లో గెలిచింది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా 21 సీట్లను, బీజేపీ 10 సీట్లలో పోటీ చేయగా 8 సీట్ల‌ను కైవసం చేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీకి ఈసారి 11 స్థానాల్లో మాత్ర‌మే గెలిచింది. 

ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 88 స్థానాలు అవసరం ఉండ‌గా ఎన్డీఏ కూటమి 164 సీట్లను కైవసం చేసుకుంది.

ఏపీ లోక్ సభ ఎన్నికల్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు టీడీపీ 16, వైఎస్సార్‌సీపీ 4, బీజేపీ 3, జనసేన 2 స్థానాల్లో గెలిచాయి. 

 

AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలు ఇవే..

వైసీపీ గెలిచిన ఎంపీ స్థానాలు ఇవే..
అరకు: గుమ్మ తనుజా రాణి
కడప: వైఎస్ అవినాశ్ రెడ్డి
తిరుపతి: గురుమూర్తి
రాజంపేట: మిథున్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ గెలిచిన ఎంపీ స్థానాలు..
శ్రీకాకుళం: రామ్మోహన్ నాయుడు
విజయనగరం: అప్పలనాయుడు కలిశెట్టి
విశాఖ: శ్రీభరత్
అమలాపురం: హరీశ్
ఏలూరు: పుట్టా మహేశ్ కుమార్
విజయవాడ: కేశినేని చిన్ని
గుంటూరు:పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట: లావు శ్రీకృష్ణ దేవరాయలు
బాపట్ల: కృష్ణ ప్రసాద్ తెన్నేటి
ఒంగోలు: మాగుంట శ్రీనివాసులు రెడ్డి
నంద్యాల: బైరెడ్డి శబరి
కర్నూలు: నాగరాజు పంచలింగాల
అనంతపురం: అంబికా లక్ష్మీనారాయణ
హిందూపురం: పార్థసారథి
నెల్లూరు: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు: దగ్గుమళ్ల ప్రసాద రావ్

జనసేన పార్టీ గెలిచిన ఎంపీ స్థానాలు..
కాకినాడ: ఉదయ్ శ్రీనివాస్
మచిలీపట్నం: బాలశౌరి వల్లభనేని

బీజేపీ గెలిచిన ఎంపీ స్థానాలు.. 
అనకాపల్లి: సీఎం రమేశ్
రాజమండ్రి: దగ్గుబాటి పురంధేశ్వరి
నర్సాపురం: భూపతి రాజు శ్రీనివాస వర్మ

Published date : 05 Jun 2024 01:43PM

Photo Stories