Skip to main content

Admission in BRAOU: బీఆర్‌ అంబేడ్కర్‌ వర్శిటీ దూరవిద్య బీఏ, బీకాంలో ప్రవేశాలు

BRAOU Distance Education admission 2023-24

గుంటూరు ఎడ్యుకేషన్‌ : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్య బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీలో చేరేందుకు తుది గడువును ఈనెల 16 వరకు పొడిగించినట్లు జేకేసీ కళాశాల క్యాంపస్‌లోని వర్శిటీ స్టడీ సెంటర్‌ ప్రాంతీయ సమన్వయకర్త పి.గోపీచంద్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. యూజీ ద్వితీయ, తృతీయ సంవత్సరాలతో పాటు పీజీ ద్వితీయ సంవత్సర ట్యూషన్‌ ఫీజు చెల్లించేందుకు ఈనెల 16 వరకు అవకాశం కలదని తెలిపారు. ఇతర వివరాలకు స్టడీ సెంటర్‌లో నేరుగా, 0863–2227950, 73829 29605 నంబర్లలోనూ సంప్రదించాలని సూచించారు.

SK University: ఎస్కేయూతో ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల అవగాహన ఒప్పందం

స్కూల్‌ గేమ్స్‌లో ప్రతిభ చాటిన పాఠశాలలకు అవార్డులు
గుంటూరు ఎడ్యుకేషన్‌ : మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా 2022–23 విద్యా సంవత్సరంలో క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను తయారు చేసిన ఐదు పాఠశాలలకు అవార్డులు ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ, జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి జి.ప్రతాప్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు పాల్గొన్న విద్యార్థుల ధ్రువపత్రాలను వ్యాయామోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించి ఈనెల 16వ తేదీలోపు గుంటూరులోని హిందూ కాలేజీ హైస్కూల్లో పీఈటీ భరత్‌కు అందజేయాలని సూచించారు. వివరాలకు 77948 27674 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.

Web options: నేటి నుంచి పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్లు

నేటి నుంచి పాలిసెట్‌ వెబ్‌ ఆప్షన్లు నమోదు
గుంటూరు ఎడ్యుకేషన్‌ : ఏపీ పాలిసెట్‌–2023లో అర్హత సాధించి, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. పాలిసెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్‌ మేరకు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. విద్యార్థులు తమ ఇళ్లలోని పర్సనల్‌ కంప్యూటర్‌, ప్రైవేటు ఇంటర్నెట్‌ కేంద్రాలతో పాటు హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు వెళ్లి ఆప్షన్లు నమోదు చేసుకునే వీలుంది. గుంటూరు శివారు నల్లపాడులోని ప్రభుత్వ ఎంబీటీఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదుకు వీలుగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వెబ్‌ ఆప్షన్ల నమోదు పూర్తయిన తరువాత ఈ నెల 18న సీట్ల కేటాయింపు జరపనున్నారు. పూర్తి వివరాలకు ఏపీ పాలిసెట్‌–2023 సైట్‌కు లాగిన్‌ కావాలి.

Published date : 11 Aug 2023 04:47PM

Photo Stories