Palamuru university: ఇంజనీరింగ్, లా కాలేజీకి గ్రీన్‌సిగ్నల్.. వందకు పైగా పోస్టుల భర్తీ
ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, పీయూ వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్ హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఆమోదానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఈ రెండు కళాశాలల్లో కూడా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ఇవ్వనున్నారు. వీటికి పూర్తిస్థాయిలో రెగ్యులర్ స్టాఫ్‌ను కూడా కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
వీటితోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఉన్న 5 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు, వనపర్తి, కొడంగల్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలను పీయూ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
Jobs In Union Bank of India 2024: డిగ్రీ అర్హతతో.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, జీతం నెలకు రూ. 77వేలు
వందకుపైగా పోస్టులు..
పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు లో రెండు విషయాలు కీలకంగా మారనున్నాయి. ఒకటి భవనం కాగా.. మరోటి సిబ్బంది కేటా యింపు. ప్రస్తుతం రీసెర్చ్ ఫెసిలిటీ భవనంలో ని ర్మించనున్న గదుల్లో తరగతులు కొనసాగనున్నా యి. ఇక విద్యార్థుల హాస్టల్ విషయానికి వస్తే లా విద్యార్థులకు ఉన్న రెండు బాల, బాలికల హాస్ట ల్స్‌లో సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇంజినీరింగ్ విద్యార్థులకు మరో హాస్టల్ నిర్మించే అవకాశం ఉంది. ఇక రెండు కళాశాలల్లో కూడా పూర్తిస్థాయిలో 100కుపైగా పోస్టులను మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఇందులో సుమారు 45కు పైగా టీచింగ్, మిగతా 55 పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం రెగ్యులర్ సిబ్బందిని కేటాయిస్తున్న నేపథ్యంలో కోర్సులను కూడా సెల్ఫ్ ఫైన్స్ కాకుండా, రెగ్యులర్ కోర్సులుగా పరిగణించి నామమాత్రపు ఫీజు లు వసూలు చేయనున్నట్లు సమాచారం.
ఉద్యోగ కల్పిత కోర్సులు..
పీయూలో ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి ఆధారిత కోర్సులను ఇందులో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం మూడు కోర్సుల్లో మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్ వంటి కోర్సులు ఉన్నాయి. మొదటి సంవత్సరం ప్రతి కోర్సులో 60 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనుండగా.. మొత్తం 180 మంది విద్యార్థులు చేరనున్నారు. సీట్లను ఐఐటీ లేదా ఎంసెట్ ప్రవేశ పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు.
లా కళాశాలలో బ్యాచులర్ ఆఫ్ లా, మాస్టర్ ఆఫ్ లా వంటి కోర్సులు ఉన్నాయి. ఈ సీట్లను లా సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రతి కోర్సులో 30 మంది చొప్పున మొత్తం 60 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అయితే వీటికి సంబంధించి అడ్మిషన్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి చేపట్టనున్నారు.
AP 10th Class Examination: ఏపీ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
సంతోషంగా ఉంది..
పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉండగా వాటికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇదే విషయమై హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపాం. కళాశాలల ఏర్పాటుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.
– జీఎన్ శ్రీనివాస్, పీయూ వైస్‌చాన్స్‌లర్
Tags
- Palamuru University
- Palamuru University Updates
- Palamuru University admissions
- palamuru university latest updates
- palamuru university 2024 latest updates
- telangana cm revanth reddy
- New Engineering Colleges
- engineering colleges
- government engineering college
- New colleges
- mahabubnagar news
- Mahabubnagar District News
- admissions
- Government engineering colleges
- Private Engineering Colleges
- private engineering colleges in telanagan