Open School : ఓపెన్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి..
అనంతపురం: సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్ విజ్ఞప్తి చేశారు. ఓపెన్ స్కూళ్ల నిర్వహణపై సంబంధిత కో–ఆర్డినేటర్లతో అనంతపురంలోని పొట్టి శ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆయన సమీక్షించారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పది, ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 31 నాటికి గడువు ముగుస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 2,300 అడ్మిషన్లు అయ్యాయన్నారు.
ఈ సంఖ్య మరింత పెంచేలా చూడాలన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 25వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ. 200 అపరాధ రుసుంతో ఈ నెల 26 నుంచి 29 వరకు, రూ.500 అపరాధ రుసుంతో 30, 31తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పదో తరగతిలో చేరడానికి 14 సంవత్సరాలు నిండిన వారు, ఇంటర్‌లో చేరడానికి పదో తరగతి పాస్ అయి 15 సంవత్సరాలు నిండిన వారు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)