Skip to main content

Web options: నేటి నుంచి పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్లు

Web options for polytechnic admissions from today

కడప ఎడ్యుకేషన్‌: పాలిటెక్నిక్‌ కళాశాలలల్లో అడ్మిషన్స్‌ కోసం పాలిసెట్‌–2023 సర్టిఫికెట్‌ చేయించుకున్న విద్యార్థులు పాలిసెట్‌ వెబ్‌ ఆప్షన్లు శుక్రవారం(నేటి) నుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌, పాలిసెట్‌ కో ఆర్డినేటర్‌ సీహెచ్‌ జ్యోతి తెలిపారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ పూర్తయిన విద్యార్థులకు ఇది వరకే తమ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన లాగిన్‌ ఐడీ, తమకు ఇచ్చిన ఐ.సి.ఆర్‌ ఫారం ద్వారా క్యాండిడేట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌తో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు వెబ్‌ అప్షన్లు పెట్టుకోవచ్చన్నారు. ఇందులో ఏవైనా సమస్యలు ఉంటే కడపలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల, ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలకు వెళ్లి పరిష్కరించుకోవాలని పాలిసెట్‌ కో ఆర్డినేటర్‌ తెలిపారు.

Polytechnic Admissions: 11 నుంచి పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు ఆప్షన్ల ఎంపిక

Published date : 11 Aug 2023 01:44PM

Photo Stories