Skip to main content

SK University: ఎస్కేయూతో ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల అవగాహన ఒప్పందం

SK University

బుక్కరాయసముద్రం: ఇన్నోవేషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌, టెక్నాలజీ పురోగతిని పెంపొందించేలా ఎస్కేయూలోని అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌తో ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బాలకృష్ణ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తూ ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల మరో అడుగు ముందుకేసిందన్నారు. స్టార్టప్‌లను పెంపొందించడంలో భాగంగా వివిద డొమైన్‌లలో వ్యవస్థాపక వెంచర్‌ల వృద్ధిని సులభతరం చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల టీపీఓ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, ఐఅండ్‌ఈడీపీ కన్వీనర్‌ డాక్టర్‌ ఆంజనేయులు, ఏఐసీ ఎస్కేయూ సీఈఓ డాక్టర్‌ శివకిరణ్‌, ఇంక్యుబేషన్‌ మేనేజర్‌ డాక్టర్‌ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Boianapalli Vinod Kumar: స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించాలి

Published date : 10 Aug 2023 07:06PM

Photo Stories