Skip to main content

Boianapalli Vinod Kumar: స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించాలి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యారంగంలో అమెరికా తరహాలో కొలంబియా కోర్సు ప్రవేశపెట్టే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, విద్యార్థులు నైపుణ్యత, స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ఎక్కువ దృష్టి సారించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.
Boianapalli Vinod Kumar
స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించాలి

ఆగ‌స్టు 9న‌ ఎల్లారెడ్డిపేట నూతన డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల పోస్టర్‌ను ఆవిష్కరించారు. 2023–24 విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రవేశానికి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీఏ, బీఎస్సీ, బీజెడ్సీ, సీఏ కోర్సుల్లో ఒక్కో గ్రూపులో 60 విద్యార్థులను తీసుకుంటారని తెలిపారు. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్పించి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ జరగాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు.

చదవండి: English భాష సామర్థ్యాల సాధనకు కృషి చేయాలి

రానున్న రోజుల్లో విద్యారంగంలో ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్‌విండో చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ కృష్ణహరి, మాజీ ఎంపీపీ ఎలుసాని మోహన్‌కుమార్‌, నాయకులు అందె సుభాష్‌, బాల్‌రెడ్డి, ఎంపీటీసీలు అనసూయ, నాగరాణి, అప్సరా ఉన్నీసా ఎడ్ల లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా మొదటి రోజు కళాశాలలో ముగ్గురు విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

చదవండి: CEC students: క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్టిఫికెట్లతో ఉపాధి

Published date : 10 Aug 2023 04:02PM

Photo Stories