Sankranthi Holidays : జనవరి 12 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు.. వీళ్లకు మూడు రోజులు మాత్రమే..
17న స్కూళ్లు తిరిగి ప్రారంభించేలా సెలవులు నిర్ణయించారు. అయితే 16న కనుమ ఉండడం, అదే రోజు ఊర్ల నుంచి బయలుదేరి మరునాడే స్కూళ్లకు రావడం అంటే ఇబ్బంది అవుతుందని పలు సంఘాలు, ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సెలవులను 18వ తేదీవరకు పొడిగించాలని కోరారు. ఆ మేరకు పాఠశాలల పనిదినాలకు ఇబ్బంది కలుగకుండా కొత్తగా సెలవుల షెడ్యూల్‌ను విద్యా శాఖ ప్రకటించింది. ఈ 7 రోజుల సెలవు దినాల్లో ఒక రోజు కాంపన్సేటరీ సెలవు అని విద్యాశాఖ పేర్కొంది.
తెలంగాణలో మాత్రం..
తెలంగాణలో సంక్రాంతి సెలవుల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని స్కూల్స్‌కు జనవరి 13వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. జనవరి 18వ తేదీన (బుధవారం) పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. పాఠశాలలకు 5 రోజులపాటు, కాలేజీలకు 3 రోజులపాటు సెలవులు ఉంటాయని వెల్లడించింది. జనవరి 14వ తేదీన భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉండగా.. జనవరి 17న కూడా సెలవురోజుగా ప్రకటించారు.
➤ చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
వీళ్లకు 3 రోజులు మాత్రమే..
తెలంగాణ జూనియర్ కాలేజీలకు కేవలం 3 రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించారు. జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. జనవరి 16న కనుమ పండుగ ఉండగా.. అదేరోజు కాలేజీలు తెరచుకోనున్నాయి. అయితే.. ఈ సారి సంక్రాంతి పండుగ ఆదివారం రోజు, భోగి రెండో శనివారం రోజు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులంతా నిరాశలో ఉన్నారు. సంక్రాంతికి ప్రత్యేక సెలవులను కోల్పోయామనే భావన వారిలో ఉంది.
➤ చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్
➤ వచ్చే ఏడాది 2023లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవే.. ఈ సారి ఉద్యోగులకు మాత్రం..