Skip to main content

TS Government Holidays : 2023లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఈ సారి ఉద్యోగుల‌కు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను సాధారణ, ఐచ్ఛిక సెలవుల‌ను ప్ర‌క‌టిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆదివారం, రెండో శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు 28 రోజులను సాధారణ సెలవులుగా, మరో 24 రోజులను ఐచ్ఛిక సెలవులుగా రానున్నాయి.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

5 మాత్రమే..
వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో  పండగల కోసం, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులున్నాయి. ఇక ఆదివారం, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అలాగే ఉన్నతాధికారుల అనుమతితో 5 మాత్రమే ఆప్షనల్ హాలిడేస్ పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

Sankranthi Holidays : జ‌న‌వ‌రి 12 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు.. వీళ్ల‌కు మూడు రోజులు మాత్ర‌మే..

ఆదివారాలే..

Holidays News

ఈ జీవో ప్రకారం.. న్యూఇయర్ ఆదివారం రోజు రాగా.. భోగి పండుగా రెండో శనివారం రోజు వచ్చింది. సంక్రాంతి పండుగ కూడా ఆదివారం రోజే వచ్చింది. దీపావళి పర్వదినం సైతం ఆదివారం నాడే వచ్చింది. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండగా అక్టోబర్ 10న వచ్చింది. ఆ రోజు సెలవు ఉంటుంది. ఇంకా విజయవదశమి సందర్భంగా అదే నెల 24న ప్రభుత్వం సెలవును ప్రకటించింది. ఈ సారి దీపావళి సెలవును నవంబర్ 12వ తేదీన‌ ప్రకటించింది.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

సాధారణ సెలవులు ఇవే..
☛ జనవరి 1 – నూతన సంవత్సరం
☛ జనవరి 14 – భోగి
☛ జనవరి 15 – సంక్రాంతి
☛ జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
☛ ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
☛ మార్చి 7 – హోళీ
☛ మార్చి 22 – ఉగాది
☛ మార్చి 30 – శ్రీరామనవమి
☛ ఏప్రిల్ 5 – బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
☛ ఏప్రిల్ 7 – గుడ్ ఫ్రైడే
☛ ఏప్రిల్ 14 – అంబేడ్కర్‌ జయంతి
☛ ఏప్రిల్ 22 –  రంజాన్‌
☛ ఏప్రిల్ 23 – రంజాన్ తదుపరి రోజు
☛ జూన్ 29 – బక్రీద్
☛ జులై 17 – బోనాలు
☛ జులై 29 – మొహర్రం
☛ ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం
☛ సెప్టెంబరు 7 – కృష్ణాస్టమి
☛ సెప్టెంబరు 18 – వినాయక చవితి
☛ సెప్టెంబరు 28   మిలాద్‌-ఉన్‌-నబి
☛ అక్టోబర్ 2 –   గాంధీ జయంతి
☛ అక్టోబర్ 14 – బతుకమ్మ ప్రారంభం
☛ అక్టోబరు 24 – విజయదశమి
☛ అక్టోబరు 25 – విజయదశమి తర్వాతి రోజు
☛ నవంబర్ 12- దీపావళి
☛ నవంబర్ 27- కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి
☛ డిసెంబరు 25 – క్రిస్మస్
☛డిసెంబర్ 26 – బాక్సింగ్ డే

Sankranthi Holidays 2023 : తెలంగాణ‌లో సంక్రాంతి సెల‌వులు ఇవే.. ఏపీలో మాత్రం భారీగానే..

ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ప్రతీ ఏటా కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వానికి చెందిన సాధారణ పరిపాలన శాఖ సెలవుల వివరాలతో కూడిన ప్రకటనను విడుదల చేస్తుంది. అయితే ఈసారి .. ఈ లిస్ట్ లో ఉన్న సెలవుల జాబితా ఫైనల్ కాదు. పరిస్థితులను బట్టీ ప్రభుత్వం ఆయా సెలవుల్లో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది దీపావళి సెలవును సైతం ప్రభుత్వం మార్చింది.

2023లో వ‌చ్చే సెలవుల పూర్తి వివ‌రాలు ఇవే..

Tealangana Holidays 2023TS Government Holidays 2023Holidays Newsholidays news telugu
Published date : 10 Jan 2023 03:31PM

Photo Stories