IPS Aashna Chowdary: పట్టువీడకుండా ఐపీఎస్‌కు ప్రయత్నించింది.. సివిల్స్‌లో ర్యాంకు సాధించింది.. కానీ..!
ఆశ్నా చౌదరీ.. ఆమె ఒక ఐపీఎస్ అధికారిని. ఉత్తర్ ప్రదేశ్‌లోని పిఖువా పట్టణానికి చెందిన మహిళ. తన తండ్రి ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్ కాగా, తల్లి గృహిణి. ఉదయ్‌పూర్, ఘజియాబాద్, పిఖువా వంటి మూడా వివిధ ప్రాంతాల్లోని పాఠశాలల్లో తన విద్యాజీవితం సాగింది. చదువులో ఈమె ఎప్పుడూ ముందే ఉంటుంది.
ఆశ్నా చాలా తెలివైన విద్యార్థి. ఇంటర్‌లో 96.5 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచింది. ఇక పై చదువులకోసం తను ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ మహిళల కళాశాల అనే గొప్ప ఖ్యాతి ఉన్న సంస్థలో తన గ్రాడ్యువేషన్‌ను పూర్తి చేసింది.
అనంతరం, సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో తన మాస్టర్స్ ప్రారంభించింది. తను మాస్టర్స్ చదువుతున్న సమయంలోనే ఒక ఎన్‌జీఓ తరుపున పేద విద్యార్థులకు విద్యను అందించేది.
సివిల్స్ ప్రయాణం..
2019లో తన చదువు పూర్తవ్వగానే, తన కుటుంబాన్ని స్పూర్తిగా తీసుకున్న ఆశ్నా.. తన జీవితాన్ని పోలీస్ సేవలవైపు మళించాలనుకుంది. ఈ ప్రయాణానికి తన కుటుంబం తనకు సహకరించి అండగా నిలిచింది. అందుకోసం, సివిల్స్ రాసేందుకు సిద్ధపడి పరీక్షకు సన్నద్దమైంది. అలా, తన మొదటి ప్రయత్నంగా 2020లో పరీక్షకు హజరైంది కాని, ముందుకు వెళ్లలేకపోయింది. తిరిగి, 2021లో ప్రిలిమ్స్‌కు మళ్ళీ చదవడం ప్రారంభించింది.
దానికి పరీక్ష రాసినా అదృష్టం కలిసి రాలేదు. రెండుసార్లు వరుసగా వెనకబడ్డా అస్సలు తగ్గలేదు. ఆశ మానలేదు. తిరిగి ప్రయత్నించాలనుకొని, 2022లో మరోసారి పరీక్షకు పాల్గొంది. ఈసారి తన ఆశ, కష్టానికి ఫలితం దక్కింది. సివిల్స్ పరీఓకు దేశంలోనే 10లక్షలపైగా విద్యార్థులు పాల్గొనగా అందోలో ఈమెకు 116వ ర్యాంకు రావడం విశేషం. పరీక్షలో 992 మార్కులను పొంది, ఐపీఎస్‌లో తనకు స్థానాన్ని సంపాదించింది. ఈ విధంగా ర్యాంకును సాధించి, చాలా మంది యువతకు ఆమె స్పూర్తిగా నిలిచింది.
Success Story : సామాన్యుడు కాదు.. ఏకంగా రూ.కోటి జీతం కొట్టాడిలా.. కానీ..
ఆశ్నా మాటలు..
గెలుపు దక్కకపోతే కృంగిపోయేకన్నా, కష్టాన్ని ఎదుర్కొని గెలుపుని సొంతం చేసుకోవాలి. నా గెలుపులో నేను పాటించింది.. సరైన ప్రణాళిక, ఆత్మ విశ్వాసం, అనుభవజ్ఞుల సలహాలు, వివిధ పుస్తకాలను చదవడం వంటివి చేయాలి. ఎన్ని ప్రయత్నాలు చేయాల్సి వచ్చినా ఓర్పుతో ఉండాలి. రోజుకి సుమారుగా ఆరు గంటపాటు చదవాలి.
మీరు చేసిన ప్రయత్నాలు విఫలమైతే, అందులో జరిగిన తప్పులు, పొరపాట్లను మరో ప్రయత్నంలో సరిదిద్దాలి. నా పరీక్ష సమయంలో నేనూ అలాగే చేశాను. నా మొదటి రెండు ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
కాని, నేను పట్టు వీడలేదు. ముందు చేసిన ప్రయత్నాలలో ఉన్న తప్పులను సరిదిద్దే దారిని చూసుకున్నాను. ఈ ప్రయత్నంలో నేను నా ప్రణాళికలో చాలా మార్పులు చేశాను. వివిధ పుస్తకాలను చదవడం, ఇతరుల సలహాలు తీసుకోవడం, నాకన్నా సీనియర్లను సంప్రదించడం, రకరకాల పరీక్షలు నాకు నేనుగానే పెట్టుకోవడం వంటి వాటిని పాటించాను. ఇతరులకు నా సలహా కూడా ఇదే..
మన గమ్యానికి చేరాలంటే మనకు పట్టుదల, కష్టం, సరైన ప్రణాళిక ఉండాలి. అంతకంటే ముఖ్యంగా మనకు ఆత్మ విశ్వాసం ఉండాలి. మనల్ని మనం నమ్మితే ఏదైనా సాధించగలం అని ఆశ్నా చౌదరీ నిరూపించింది.
Tags
- civils success stories
- Civils Rankers
- UPSC Exams
- success stories of civils rankers
- inspirational stories
- Ashna Chowdary
- IPS
- upsc rankers
- civils results
- story of civils services rankers
- civil services rankers success
- inspirational story of success
- young women success story in civils
- women ips success stories in telugu
- women as ips success
- uttar pradesh women success in ips
- IPS success stories of women
- IPS stories of women