Good Idea : ఈ ఐడియాతో.. నేను ఏ పనిపాట చేయకుండానే ఉంటా.. కానీ.. రూ.830 కోట్ల సంపాదిస్తా.. ఎలా అంటే..?
అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ప్రపంచ కుబేరులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ 'స్టీవ్ బాల్మెర్'. ఇంతకీ ఈయన కష్టపడకుండా ఎలా సంపాదించాడు..? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి..? మొదలైన వివరాలు ఈ పూర్తి వివరాలు కింది స్టోరీలో చూడొచ్చు.
ఒక్క ఈ ఏడాది మాత్రమే..
మైక్రోసాఫ్ట్‌లో అతిపెద్ద వాటాదారు అయిన బాల్మెర్ కంపెనీలో దాదాపు 4 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇది దాదాపు 333.2 మిలియన్ షేర్లకు సమానమని సీఎన్ఎన్ నివేదించింది. ఈ వాటా విలువ ఇప్పుడు ఏకంగా 130 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఒక్క ఈ ఏడాది మాత్రమే ఆయన సంపద 44 బిలియన్ డాలర్లు పెరిగినట్లు సమాచారం. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ ధర ఏకంగా 56 శాతం పెరగడంతో బార్మర్ సంపాదన కూడా పెరిగింది. మొత్తానికి స్టీవ్ బాల్మెర్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి వార్షిక డివిడెండ్ చెల్లింపులలో 1 బిలియన్లను అందుకోబోతున్నారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ ఏకంగా రూ. 830 కోట్లకంటే ఎక్కువ.
ప్రపంచ ధనవంతుల జాబితాలో..
1980లో 30వ ఉద్యోగిగా చేరిన స్టీవ్ బాల్మెర్ అతి తక్కువ కాలంలోనే గణనీయమైన వాటాను సంపాదించాడు. అంతే కాకుండా 2000లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికై 2014లో పదవీవిరమణ చేశాడు. వాటా యాజమాన్యం కారణంగా, స్టీవ్ బాల్మెర్ ప్రపంచ ధనవంతుల జాబితాలో నాల్గవ స్థానంలో చేరటానికి అవకాశం ఉందని తెలుస్తోంది.