Forbes 2024: ఫోర్బ్స్ 2024 సంపన్నుల జాబితా విడుదల.. అందరికంటే రిచ్ ఈ పెద్దాయనే..
2024లో రికార్డు స్థాయిలో 2,781 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 ఎక్కువ. 2021లో నమోదైన రికార్డు కంటే 26 ఎక్కువ. ఈ లిస్ట్‌లోని బిలియనీర్ల మొత్తం సంపద 14.2 ట్రిలియన్ డాలర్లు (11.8 కోట్ల కోట్లు) అని పేర్కొంది.
ఈకాగా ఈసారి ఫోర్బ్స్ లిస్ట్‌లో కొత్తగా పలువురు సెలబ్రిటీలు చేరారు. పాప్ సంచనం టేలర్ స్విఫ్ట్ ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో అడుగు పెట్టింది.
అక్టోబర్‌లో బిలియనీర్ హోదాకు చేరుకున్న ఈ పాప్ సూపర్ స్టార్, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిహన్న, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్‌ఫ్రే, స్టార్ వార్స్ సృష్టికర్త జార్జ్ లూకాస్‌లతో కలిసి చేరారు. 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,169 కోట్లు) భారీ నెట్‌వర్త్‌తో స్విఫ్ట్ 14వ స్థానంలో నిలిచింది.
ఫోర్బ్స్ టాప్ టెన్ లిస్ట్ ఇదే..
ర్యాంక్ | పేరు |
నికర విలువ |
వయస్సు |
1 |
బెర్నార్డ్ ఆర్నాల్ట్ & కుటుంబం |
$233 బి |
75 |
2 |
ఎలన్ మస్క్ |
$195 బి |
52 |
3 |
జెఫ్ బెజోస్ |
$194 బి |
60 |
4 |
మార్క్ జుకర్బర్గ్ |
$177 బి |
39 |
5 |
లారీ ఎలిసన్ |
$141 బి |
79 |
6 |
వారెన్ బఫెట్ |
$133 బి |
93 |
7 |
బిల్ గేట్స్ |
$128 బి |
68 |
8 |
స్టీవ్ బాల్మెర్ |
$121 బి |
68 |
9 |
ముఖేష్ అంబానీ |
$116 బి |
66 |
10 |
లారీ పేజ్ |
$114 బి |
51 |