Skip to main content

Inspiring Success Story : తండ్రి మన‌స్సును గెలిచిన బిడ్డ‌లు.. ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులే.. ఎలా అంటే..?

ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలనే తపనకు తోడుగా.. చదువులో పిల్లలు రాణించడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు ఆ ఇల్లు నిలయమైంది.
tspsc group 1 success story in telugu
Group 1 Officer Jayasudha Family Success Story

చేసేది చిన్న ఉద్యోగమైనా ఆ తండ్రి తీసుకున్న నిర్ణయాలు నేడు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. వీరీలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారంటే అందులో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతుందో.. మీకే అర్థం అవుతుంది.

☛➤ Inspirational Story: పోటీ పరీక్షల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు.. తల్లీకూతుళ్లు.. ఒకసారి వీరి గురించి తెలుసుకోవాల్సిందే..!

స్త్రీ, పురుష అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చదివించడంలో వారి కృషి, కష్టం అంతకు రెట్టింపు ఉంది. అలాగే ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆ తల్లిదండ్రుల కోరిక నెరవేర్చిన కుమార్తెల్లో ఒకరైన జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్‌ జయసుధ విజ‌యం ర‌హ‌స్యాలు మీకోసం..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

కుటుంబ నేపథ్యం :  
కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన రాజారాం, సరోజలకు ఇద్దరు కుమారులు డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ (బాన్సువాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌) శ్రీధర్‌(ఉపాధ్యాయుడు), నలుగురు కుమార్తెలు విజయలక్ష్మి(గృహిణి), డాక్టర్‌ లత (ప్రొఫెసర్‌), డాక్టర్‌ జయసుధ(డీపీఓ), ప్రవీణ (ఉపాధ్యాయురాలు). 

☛➤ Success Story: అన్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌... తమ్ముడు ఐపీఎస్‌

మీ కాళ్ల మీద మీరే నిలబడాలంటూ తరచూగా..
రాజారాం పోస్ట్‌మాస్టర్‌ ఉద్యోగం చేసుకుంటూ కుమారులు, కుమార్తెలు అన్న తేడా లేకుండా ఉన్నత చదువులు చదివించారు. చదువులో వారి సహకారం, ప్రోత్సాహంతోనే ప్రస్తుతం అందరూ ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. మీ కాళ్ల మీద మీరే నిలబడాలని తరచూ గుర్తుచేస్తూనే పిల్లల లక్ష్యాలలో ఆ తండ్రి పాలుపంచుకున్నారు.

☛➤ Success Story : నలుగురు తోబుట్టువుల్లో.. ముగ్గురు ఐఏఎస్‌లు.. ఒక ఐపీఎస్‌.. వీరి స‌క్సెస్ సీక్రెట్ మాత్రం ఇదే..

ప్రభుత్వ స్కూళ్లల్లోనే.. చ‌దివి..
రాజారాం, సరోజ దంపతుల ఐదో సంతానమైన డాక్టర్‌ జయసుధ చిన్ననాటి నుంచి చదువులో రాణించేవారు. ఐదో తరగతి వరకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో, నవోదయ విద్యాలయంలో 6 నుంచి ఇంట‌ర్‌ వరకు చదివారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువును కొనసాగించారు. చిన్నప్పటి నుంచే వసతిగృహాల్లో ఉంటూ ఉన్నత చదువులు పూర్తిచేశారు. మాస్టర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైస్సెస్‌ పూర్తి చేసిన జయసుధ పదేళ్ల పాటు హైదరాబాద్‌లోని వెటర్నరీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేశారు.

➤ Success Story : ఒకే క‌ల‌.. ఒకే స్టడీ మెటిరీయల్ చ‌దువుతూ.. అక్కాచెల్లెళ్లిద్దరూ ఐఏఎస్ ఉద్యోగం కొట్టారిలా..
మొదటి ప్రయత్నంతోనే గ్రూప్‌–1 ఉద్యోగం కొట్టానిలా..

group 1 ranker jayasudha success story telugu

వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగం చేస్తున్నా.. ఎక్కడో ఏదో ఒక వెలితి. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో గ్రూప్స్‌కు సిద్ధమయ్యారు. అదే క్రమంలో వెటర్నరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా కూడా ఉద్యోగం సాధించారు. 2015లో సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. మొదటి ప్రయత్నంలోనే 2017లో గ్రూప్‌–1 సాధించారు. ఏడాది శిక్షణ తర్వా త జిల్లా పంచాయతీ అధికారిగా మొదటి పోస్టింగ్‌ నిజామాబాద్‌లోనే నియమితులయ్యారు. 

☛➤ TSPSC Group 1 Mains : గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో తండ్రీ కొడుకులు పాస్‌.. మెయిన్స్‌కు ఇలా..

ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే..
ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వచ్ఛభారత్‌ మిషన్‌లో జాతీయస్థాయిలో మొదటిస్థానంలో జిల్లాకు అవార్డు దక్కింది. అలాగే సంసద్‌ ఆదర్శ గ్రా మ్‌ యోజనలో మొదటి 20 గ్రామాల్లో జిల్లా నుంచే 5 ఉత్తమ పంచాయతీలుగా ఎంపికై అవార్డులు పొందడం సంతోషానిచ్చింది. ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో డీపీవోగా నాలుగేళ్లు ఎంతో సంతృప్తినిచ్చిందని జయసుధ పేర్కొన్నారు. 2010లో బిచ్కుంద కు చెందిన నాగనాథ్‌తో జయసుధ వివాహమైంది.

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

Published date : 08 Mar 2023 05:43PM

Photo Stories