Skip to main content

Environmental Issues: పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ముఖ్యంగా ఈ అంశాల నుండే

పోటీ పరీక్షల్లో జీవ వైవిధ్యం, ఎకాలజీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
Environmental Issues
  • ఎకాలజీ, శీతోష్ణస్థితి మార్పు, పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన అంశాలపై వివిధ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు క్రమం తప్పకుండా వస్తున్నాయి.
  • ఆవరణ శాస్త్ర పరిభాష, ప్రాథమిక అంశాలైన జీవుల అనుకూలనాలు (Adaptations), ఆవరణ వ్యవస్థ, రకాలు, ఆహార శృంఖాలు, బయో జియో కెమికల్ సైకిల్స్ (Biogeo chemical cycles), ఆహార వల వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.

పర్యావరణ పరిరక్షణ చట్టాలు- ఉద్యమాలు- సదస్సులు

  • జీవ వైవిధ్యానికి సంబంధించి వాటి స్థాయి, రకాలు, జీవ వైవిధ్యానికి గల కారణాలు, ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవ వైవిధ్య హాట్‌స్పాట్స్, పరిరక్షణ పద్ధతులు, సమస్యలు మొదలైన వాటి గురించి క్షుణ్నంగా చదువుకోవాలి.
  • గతంలో ఈ విభాగంలో అడిగిన ఒక ప్రశ్నను పరిశీలిస్తే.. దేశంలో రాబందుల సంఖ్య తగ్గడానికి కారణం? దీనికి సమాధానం.. పశువుల్లో అతిగా వాపు నివారణకు మందుగా ఉపయోగించే డై క్లోఫినాక్ అనే రసాయనం.
  • జీవ వైవిధ్యానికి ప్రమాదాలు అని ప్రస్తావించినప్పుడు.. ప్రస్తుతం సమకాలీనంగా చోటు చేసుకుంటున్న సంఘటనల (వార్తల్లో అంశాలు)పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

Study Material: పర్యావరణ కాలుష్యం

  • బట్టమేక పక్షి (Great Indian Bustard)ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఫర్ నేచర్ (IUCN-The International Union for Conservation of Nature) క్రిటికిల్లీ ఎండేంజర్‌‌డ జాబితాలో చేర్చారు. ఈ క్రమంలో సంబంధిత సమాచారాన్ని .. ఆ పక్షి విస్తరణ, దానికి ప్రత్యేకంగా ఏర్పడుతున్న ప్రమాదాలు, దాని శాస్త్రీయ నామం-వంటి అంశాల ఆధారంగా సేకరించడం ఉపయుక్తంగా ఉంటుంది.
  • ఇదే దృక్పథాన్ని ఇతర సంఘటనలకు అన్వయించుకోవడం ప్రయోజనకరం.

Study పర్యావరణ సమస్యలు - విపత్తు

Published date : 15 Apr 2022 01:07PM

Photo Stories