Skip to main content

Group I: దరఖాస్తులు నేటి అర్ధరాత్రి వరకు.. గడువు పొడిగింపుపై..?

గ్రూప్‌–1 ఉద్యోగ పరీక్షల దరఖాస్తుకు గడువు దగ్గర పడింది. మే 2న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మే 31 అర్ధరాత్రితో ముగియనుంది.
Group I
గ్రూప్–1 దరఖాస్తులు నేటి అర్ధరాత్రి వరకు.. గడువు పొడిగింపుపై..?

వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 కొలువుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మార్చి 26న నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాలు చేపట్టడం... అందులోనూ ఒకేసారి 503 కొలువులను సింగిల్‌ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయడంతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టించింది. దీంతో దరఖాస్తు ప్రక్రియకు పెద్దఎత్తున స్పందన వస్తోంది. ఇప్పటివరకు 2,88,369 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మే 31 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తుకు గడువు ఉండటంతో మొత్తం 3 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు టీఎస్‌పీఎస్సీ అంచనా వేస్తోంది.

చదవండి: 

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

TSPSC Group-1 Syllabus: 503 పోస్టులు.. గ్రూప్‌–1 ప‌రీక్ష‌ల‌ సిల‌బ‌స్ ఇదే..

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?  

గడువు పెంపు లేనట్లే!:

గ్రూప్‌–1 ఉద్యోగ దరఖాస్తు గడువు పెంపుపై టీఎస్‌పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దరఖాస్తు సమర్పణలో తొలుత టీఎస్‌ పీఎస్సీ వెబ్‌సైట్‌ కాస్త నెమ్మదించినప్పటికీ.. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్‌ను పరిగణించి సాంకేతిక సమస్యలకు చెక్‌ పెట్టింది. మరోవైపు బోనఫైడ్‌ల అప్‌లోడ్‌ విషయంలోనూ మినహాయింపు ఇవ్వడంతో రోజుకు సగటున పదివేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. గడువు పొడిగింపు కోసం టీఎస్‌పీఎస్సీకి పెద్దగా డిమాండ్‌ రాలేదు. మే 31 నాటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెప్పాయి. 

Published date : 31 May 2022 03:58PM

Photo Stories