Skip to main content

Age Limit for Uniform Services: యూనిఫామ్‌ సర్వీసులకు గరిష్ట వయోపరిమితి పెంపు

సాక్షి, హైదరాబాద్‌: డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా వివిధ యూనిఫామ్‌ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని యూనిఫామ్‌ సర్వీసులకు సంబంధించి రాబోయే రిక్రూట్‌మెంట్లకు ఇది వర్తించనుంది.
 Increased Maximum Age Limit for Uniform Services Recruitment  Increased Age Limit for Hyderabad Uniform Services Jobs   State Government Extends Age Limit for Uniform Services   Hyderabad Recruitment Update   Age Limit for Uniform Services Govt raises upper age limit by 2 years for Uniform Services

యూనిఫామ్‌ పరిధిలోకి వచ్చే సర్వీసులివే..
యూనిఫామ్‌ సర్వీసుల పరిధిలోకి వచ్చే వివిధ సర్వీసులు, కేటగిరీల పోస్టులు.. పోలీస్, అగ్నిమాపక, జైళ్లశాఖ, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌), ఎక్సైజ్, రవాణా, అటవీశాఖ ఉద్యోగాలకు ఐదేళ్ల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ నిర్ణయం
దీంతో నిరుద్యోగుల నుంచి పెద్దసంఖ్యలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో మరింత మంది నిరుద్యోగ యువతకు అర్హత కల్పించే ఉద్దేశంతో యూనిఫామ్‌ సర్వీసెస్‌కు కూడా గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈమేరకు తెలంగాణ రాష్ట్ర గెజిట్‌లో ఈనెల 8న నోటిఫికేషన్‌ను పబ్లిష్‌ చేశారు. 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీచేసిన ఉత్వర్వుల్లో యూనిఫామ్‌ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని పెంచకపోవడం గమనార్హం.

15,000 Constable Posts Notification 2024 : కచ్చితంగా.. కేవలం 15 రోజుల్లోనే 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ ఇస్తాం ఇలా.. : సీఎం రేవంత్

Published date : 20 Feb 2024 12:26PM

Photo Stories