Food and Nutrition Courses: డిగ్రీ, పీజీ స్థాయిలో న్యూట్రిషన్ కోర్సులు..
సాక్షి ఎడ్యుకేషన్: బైపీసీ ఉత్తీర్ణులకు సంప్రదాయ బీఎస్సీ బీజెడ్‌సీతోపాటు పలు వినూత్న కాంబినేషన్లతో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని పూర్తి చేసుకుంటే.. జాబ్ మార్కెట్ అవకాశాలు విస్తృతం అవుతాయి. అలాంటి కోవకు చెందిన కోర్సు.. బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్! ఇటీవల కాలంలో ప్రజల్లో ఆరోగ్య శ్రద్ధ పెరగడంతో ఫుడ్, న్యూట్రిషన్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
Sreeja Akula: టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి నంబర్ వన్!
డిగ్రీ, పీజీ కోర్సులు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్‌కు సంబంధించి ప్రస్తుతం డిగ్రీ, పీజీ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో న్యూట్రిషన్, బయాలజీ, కెమిస్ట్రీ కాంబినేషన్‌తో..అదే విధంగా ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్ కాంబినేషన్లతో కోర్సులు అందిస్తున్నారు. దీంతోపాటు హోంసైన్స్ విభాగంలో గుర్తింపు పొందిన హైదరాబాద్(ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ)లోని కాలేజ్ ఆఫ్ హోంసైన్స్‌లోనూ బీఎస్సీలో ఫుడ్, న్యూట్రిషన్, డైటిటిక్స్ అంశాలను బోధిస్తారు. ఇదే కాలేజ్‌లో పీజీ స్థాయిలో న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్ స్పెషలైజేషన్‌తో కోర్సు అందుబాటులో ఉంది. జాతీయ స్థాయిలో పలు సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో ఫుడ్, న్యూట్రిషన్ కోర్సులను అందిస్తున్నారు. సీయూఈటీ–యూజీ స్కోర్ ఆధారంగా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
Academic Year Admissions: ఐఎంయూలో ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తులు..
ఎన్‌ఐఎన్‌లో ఎమ్మెస్సీ
హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్).. ఎమ్మెస్సీ అప్లయిడ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్సులను అందిస్తోంది. వీటికి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీలో అప్లయిడ్ న్యూట్రిషన్, హోంసైన్స్, పుడ్ అండ్ న్యూట్రిషన్, నర్సింగ్, న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్ తదితర స్పెషలైజేషన్లు పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 23న ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 2024, మే 20. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://icmrnin.aptonline.in/ ICMRNIN/Views/Application/Home
సెంట్రల్ వర్సిటీల్లో పీజీ
ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ స్థాయిలో ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. బీహెచ్‌యూ–వారణాసి, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, ఇగ్నోతోపాటు పలు ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీల్లో లైఫ్ సైన్సెస్ విభాగాల పరిధిలో ఫుడ్, న్యూట్రిషన్ స్పెషలైజేషన్స్‌తో పీజీ కోర్సులు అందిస్తున్నారు. వీటిలో ప్రవేశానికి సీయూఈటీ–పీజీ ఎంట్రన్స్‌లో స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.
Inter Supplementary Time Table: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ టైం టేబుల్ విడుదల
పీహెచ్‌డీ కూడా
ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌లో పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతా, యూనివర్సిటీ ఆఫ్ మైసూర్, పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీలో చేరొచ్చు. ఇందుకోసం యూజీసీ–నెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా యూనివర్సిటీలో, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదే విధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసే వీలుంది. తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలో చేరే అవకాశముంది.
కోర్సులో బోధించేవి
ఫుడ్ న్యూట్రిషన్ సైన్స్ కోర్సుల్లో భాగంగా న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ, శానిటైజేషన్, హైజీన్, డైట్ థెరపీ, పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ న్యూట్రిషన్ వంటి అంశాలను బోధిస్తారు. కరిక్యులంలో భాగంగా ఫీల్డ్ స్టడీ కూడా చేయాల్సి ఉంటుంది. దీంతో అకడమిక్ స్థాయిలోనే విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన వస్తుంది. ఫలితంగా కోర్సు పూర్తయ్యే నాటికి నెపుణ్యాలు సొంతం చేసుకుని జాబ్ మార్కెట్ అసవరాలకు అనుగుణంగా రూపొందే అవకాశం ఉంటుంది.
UPSC CAPF Notification 2024: డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి
ఉపాధి వేదికలు
ఫుడ్, న్యూట్రిషన్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి హాస్పిటల్స్, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. రోగులకు.. ఆహార నియమాలను వివరించడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రత్యేకంగా డైటీషియన్స్‌ను నియమించుకుంటున్నాయి. ఇందుకోసం ఈ విభాగంలో డిగ్రీ, పీజీ చేసిన వారికి అవకాశం కల్పిస్తున్నాయి. అదే విధంగా స్పోర్ట్స్ క్లబ్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఐసీడీఎస్ విభాగాల్లోనూ న్యూట్రిషన్, డైటిషియన్ నిపుణుల అవసరం నెలకొంది.
PG Admissions: నిఫ్టెమ్‌లో పోస్ట్ గ్రాడ్యువేషన్ ప్రవేశాలు.. ఈ కోర్సుల్లోనే..
కార్పొరేట్ సంస్థలు
ఫుడ్, న్యూట్రిషన్ స్పెషలిస్ట్‌లకు కార్పొరేట్ కంపెనీల్లోనూ ఉపాధి లభిస్తోంది. ముఖ్యంగా ఆహార పదార్థాల తయారీ సంస్థలు..ఫుడ్, న్యూట్రిషన్ స్పెషలిస్ట్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆయా ఆహార పదార్థాల తయారీలో పొందుపర్చాల్సిన పోషకాల శాతం, వాటి నిల్వకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు వీరిని నియమించుకుంటున్నాయి. దీంతో ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో న్యూట్రిషిన్ నిపుణులకు ప్రాధాన్యం పెరుగుతోంది. నెస్లె, బ్రిటానియా, క్వాలిటీ, హాట్సన్, డాబర్, క్యాడ్‌బరీ, ఐటీసీ వంటి సంస్థలు టాప్ రిక్రూటర్స్‌గా నిలుస్తున్నాయి.
Tags
- food and nutrition course
- Degree
- Post Graduation
- healthy life style
- National Institute of Nutrition
- national level entrance exam
- Online Registration
- employment offers
- Corporate companies
- Education News
- Sakshi Education News
- HealthAwareness
- CareerOpportunities
- NutritionistCareer
- DieticianJobs
- HealthyEatingHabits
- NutritionalCounseling
- DietaryGuidelines
- HealthEducation
- NutritionCourses