సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పేపర్-2 ప్రాథమిక కీ ని కన్వీనర్ రాధారెడ్డి జూన్ 15వ తేదీన (బుధవారం) విడుదల చేశారు.
TS TET 2022 Paper 2 Initial Key
టీఎస్ టెట్ పేపర్-2 ప్రాథమిక కీ పై మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే https://tstet.cgg.gov.in//TSTETAPPL2022/#!/acceptObjections.htm ఈ లింక్ ద్వారా తెలపవచ్చును. టెట్ పరీక్ష జూన్ 12వ తేదీన(ఆదివారం) జరిగిన విషయం తెల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించారు. టెట్ పేపర్–2 పరీక్షను మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరిగింది. టీఎస్ పేపర్–2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకోక.. 251,070(90.35శాతం) మంది హాజరయ్యారు. అలాగే ఈ టెట్ ఫలితాలను జూన్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు కన్వీనర్ తెలిపారు. తెలంగాణ టెట్ 2022 ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.