Skip to main content

TET Exam: వనపర్తి జిల్లాలో టెట్‌ పరీక్షకు 88.89 శాతం హాజరు

TET exam in Vanaparthi district,88.89% attendance rate, Peaceful conclusion,12,733 candidates
TET exam in Vanaparthi district

వనపర్తిటౌన్‌, కొత్తకోట: టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) ప్రవేశ పరీక్ష శుక్రవారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. రెండు విడతల్లో పరీక్ష నిర్వహించగా.. పేపర్‌–1, పేపర్‌–2కు మొత్తం 12,733 మంది హాజరుకావాల్సి ఉండగా.. 11,230 మంది హాజరు కాగా.. 1,503 గైర్హాజరయ్యారు. దీంతో మొత్తం 88.89 శాతంగా హాజరు నమోదయ్యింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించిన పేపర్‌–1 పరీక్షకు 7,186 మంది హాజరుకావాల్సి ఉండగా.. 6,078 మంది హాజరై, 1,108 మంది అభ్యర్థులు గైర్హాజరవగా.. 84.6శాతం హాజరు నమోదయ్యింది.

పేపర్‌–1ను జిల్లా కేంద్రంలోని వనపర్తిలో 28, కొత్తకోటలో 2, మొత్తం 30 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. పేపర్‌–2 పరీక్షను మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలోని 25 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా.. 5,547 మందికి గాను, 5,152 మంది హాజరవగా.. 395 మంది గైర్హాజరవగా 92.88 శాతం హాజరు నమోదయ్యింది.

పరుగే పరుగు..

టెట్‌ నిర్వహణకు వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు, చంటి పిల్లల తల్లులు తమ పిల్లలను ఎత్తుకొని పరీక్ష కేంద్రాలకు వచ్చారు. తల్లులు పరీక్షలు రాసేందుకు వెళ్లగా కొన్ని చోట్ల తండ్రులు పిల్లలను ఆడిస్తూ పరీక్ష కేంద్రాల వద్ద ఉండటం కనిపించింది. కొన్ని పరీక్ష కేంద్రాల్లో భార్యాభర్తలు ఇరువురు పరీక్ష రాసేందుకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులతో కలిసి పరీక్ష కేంద్రాల్లో వసతులు, పరీక్ష నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.

Published date : 19 Sep 2023 09:25AM

Photo Stories