TET Fees: టెట్‌లో పాత ఫీజు విధానమే కొనసాగాలి..
Sakshi Education
గతంలో కన్నా ప్రస్తుతం టెట్ పరీక్షకు చెల్లించాల్సిన ఫీజును పెంచేసారు. ఇది అభ్యర్థులకు ఏ విధంగా కష్టంగా మారిందో తెలిపారు పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు..
కరీంనగర్: టెట్ ఫీజు తగ్గించాలని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ అన్నారు. గురువారం కరీంనగర్‌లోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఒక పేపర్ రాస్తే రూ.200, రెండు పేపర్లు రాస్తే రూ.400 ఫీజు ఉండేదన్నారు.
Tenth Class Public Exams 2024 : పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కు సర్వం సిద్ధం
ప్రస్తుతం రూ.1,000, రూ.2000కు పెంచడంతో నిరుద్యోగులపై భారం పడుతోందని పేర్కొన్నారు. వారి భవిష్యత్‌ను దృష్టిలో పెటుకొని, పాత ఫీజు విధానాన్నే కొనసాగించాలని కోరారు. సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేశ్, రాజేశ్, శ్రవణ్ పాల్గొన్నారు.
Annual Day Celebrations: అట్టహాసంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు
Published date : 29 Mar 2024 04:30PM