Mirabai Chanu: ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్పర్సన్ మీరాబాయ్ చాను

ఆమెను ఇండియన్ వెయిట్‌లిఫ్టింగ్ కమిషన్(IWLF) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో నాలుగు సంవత్సరాలపాటు ఆమె కొనసాగనున్నారు.
మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్‌లో 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించారు. 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్, 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు.
మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం, 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్, 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కేజీల లిఫ్ట్‌లు చేసి జాతీయ రికార్డులను నెలకొల్పారు.
అలాగే.. మీరాబాయితో పాటు కమీషన్ వైస్-ఛైర్‌పర్సన్‌గా మరో ప్రముఖ వెయిట్ లిఫ్టర్ సతీష్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాదించారు.
Shreyas Iyer: ఐసీసీ అవార్డు గెలుచుకున్న శ్రేయస్ అయ్యర్.. గిల్, బుమ్రా మాత్రమే..!