Annual Day Celebrations: అట్టహాసంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు
చిత్తూరు కలెక్టరేట్: ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ఉన్నత ఆశయం ముఖ్యమని సీనియర్ సివిల్ జడ్జి డా.కరుణకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం వార్షికోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన కరుణకుమార్ మాట్లాడుతూ అమ్మాయిలు గడపదాటడమే తప్పుగా భావించే కాలంలో కళాశాల స్థాపనకు తమ వంతు సహాయాన్ని అందించిన కళాశాల స్థాపకుల సేవలు గొప్పవన్నారు. వేల సంఖ్యలో విద్యార్థినులు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కళాశాల వ్యవస్థాపకుల చొరవవల్లేనని తెలిపారు.
Degree Admissions: డిగ్రీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేది ఇదే
సీపీడీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరచౌదరి మాట్లాడుతూ ఒక కుటుంబం అభివృద్ధి మహిళ విద్యతోనే సాధ్యమవుతుందన్నారు. మరొక అతిథి దశరథరెడ్డి మాట్లాడుతూ నేటి యువత సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశపురోగతి సాధ్యమవుతుందని చెప్పారు. అనంతరం ఆ కళాశాలలో ఆరు గ్రూపులలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ.4 వేలు చొప్పున రూ.1 లక్ష స్కాలర్‌షిప్పులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, వైస్ ప్రిన్సిపల్ నరేంద్రకుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.
Tenth Exam by Senior: పదో తరగతి పరీక్షలు రాస్తున్న సీనియర్లు..