TG Summer Holidays 2025 : గుడ్ న్యూస్.. పాఠశాలలకు సెలవులు ప్రారంభం.. ఈ తేదీల్లోనే

సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులకు గెంతులేసే వార్త.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులందరికీ శుభవార్తే ఇది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేసవి సెలవులు వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మెరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఇక, విద్యార్థులకు ఈ నెల 24వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది సర్కార్. ఇక, ప్రభుత్వ జారీ చేసిన ఆదేశాల మెరకు విద్యార్థులకు ఈనెల 23వ తేదీన వారి వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులను అందజేయాలని స్పష్టం చేసింది.
Self Employment Scheme : 6 ఏళ్ల తరువాత స్వయం ఉపాధి పథకం.. దరఖాస్తుల్లో ఇబ్బందులు.. కారణం!!
పునఃప్రారంభం తేదీ ఇదే..
ఇక, వేసవి సెలవులు ఈనెల అంటే, ఏప్రిల్ 24వ తేదీన ప్రారంభం అవుతుండగా.. తిరిగి జూన్ 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను పునఃప్రారంభం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే, అటు పలు ప్రైవేట్ విద్యాసంస్థలు ఒక అడుగు ముందుకేస్తూ.. ఈనెల 24వ తేదీ కంటే ముందే సెలవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులు తమకు ఎప్పుడు వేసవి సెలవులు ప్రారంభం అవుతాయా.. అని వేచిచూస్తుండగా ఈ వార్త రావడం వారికి గెంతులేసే వార్తే అవతుందిగా..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Summer Holidays
- Telangana Schools
- government declares summer holidays
- TG Summer holidays 2025
- Good News For Students
- School Students
- school holidays dates
- reopening of schools
- tg govt and private schools
- summer holidays news for tg students
- Telangana Schools Re opening 2025
- summer vacation of tg schools
- Telangana Schools Summer Holidays 2025 latest updates
- Telangana Schools Summer Holidays 2025 latest updates news in telugu
- Summer Holidays news in telugu
- Education News
- Sakshi Education News