TS TET 2023 Child Development & Pedagogy Bitbank: టాపిక్ వారీగా ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్
టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తెలంగాణ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం DSC/TRT పరీక్ష రాయడానికి అర్హులవుతారు. TET స్కోర్ ఇప్పుడు మొత్తం జీవితకాలం చెల్లుతుంది. కాబట్టి, ఒకసారి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు, TRT/DSC నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు పరీక్షలు రాసుకోవచ్చు.
TS TET 2023 Exam Pattern & Eligibility : ఈ టిప్స్ పాటిస్తే.. టెట్‌లో టాప్ స్కోర్ మీదే..
ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 15న పరీక్ష, 27న ఫలితాలు విడుదల కానున్నాయి. పేపర్-1 మొత్తం 150 మార్కులు, పేపర్-2 150 మార్కులకు ఉంటుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులూ అర్హులే. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
TS TET 2023 Child Development & Pedagogy బిట్‌బ్యాంక్
Sakshieducation.com ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణుల సహాయంతో TS TET బిట్‌బ్యాంక్‌ను సిద్ధం చేసింది. అన్ని సబ్జెక్టులకు ప్రాక్టీస్ ప్రశ్నలు అందుబాటులో ఉన్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు తమ ఖాళీ సమయంలో ప్రాక్టీస్ చేసి TET పరీక్షకు సిద్ధం అవొచ్చు. కింది Child Development & Pedagogy బిట్‌బ్యాంక్ లింకులను క్లిక్ చేసి చేయండి.
- చాప్టర్ 1 - వైయుక్తిక భేదాలు - ప్రజ్ఞ
- చాప్టర్ 1 - మూర్తిమత్వం (Personality)
- చాప్టర్ 1 - పెరుగుదల - వికాసం
- చాప్టర్ 2 - స్మృతి - విస్మృతి
- చాప్టర్ 2 - మార్గదర్శకత్వము - మంత్రణం
- చాప్టర్ 2 - అభ్యసనం
- చాప్టర్ 3 - బోధనాభ్యసన అనుభవాలు
- చాప్టర్ 3 - NCF - 2005, విద్యాహక్కు చట్టం - 2009
- చాప్టర్ 3 - ప్రత్యేక అవసరాలు ఉన్న అభ్యర్థులు
- చాప్టర్ 3 - మనో విజ్ఞాన శాస్త్ర స్వభావం - పద్ధతులు
- విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు?
- అనుభవ పూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
- పెరుగుదల - వికాస నియమాలు
12 వేల టీచర్ పోస్టులను..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఓ అంచనా కాగా.. ప్రభుత్వం మాత్రం 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. పైగా గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టారు. కొన్ని పాఠశాలల్లో ఎస్‌జీటీలను ఉన్నత తరగతులకు పంపుతున్నారు. ఇందులో చాలామంది స్కూల్ అసిస్టెంట్లకు అర్హత ఉన్నా, పదోన్నతులు లేకపోవడంతో ఫలితం దక్కడం లేదు. పదోన్నతులు లేకపోవడంతో బదిలీలు జరగడం లేదు.