అనుభవ పూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1. శ్రీనికేశ్ భౌతిక శాస్త్ర సూత్రాలను ఉపయోగించి సృజనాత్మకతతో కూడిన పరికరాలను రూపొందిస్తున్నాడు. అయితే పియాజె సంజ్ఞానాత్మక వికాసంలో శ్రీనికేశ్ ఏ దశకు చెందుతాడు?
a) పూర్వ ప్రచాలక దశ
b) మూర్త ప్రచాలక దశ
c) అమూర్త ప్రచాలక దశ
d) ఇంద్రియాచాలక దశ
- View Answer
- సమాధానం: c
2. మొక్కల పరిరక్షణలో ఉత్తమంగా నిలిచిన వారికి బహుమతి లభిస్తుందని తెలిసి, హస్వితేజ్ తను నాటిన మొక్కను పరిరక్షించాడు. అయితే అతడు కొల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు?
a) దశ- iii
b) దశ- iv
c) దశ- v
d) దశ - ii
- View Answer
- సమాధానం: d
3. వికాస్ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై సామాజికంగా, ఆర్థికంగా ముందు వరుసలో ఉడండం వల్ల రిజర్వేషన్లు అనుభవించడం సరికాదని భావించి, రిజర్వేషన్లో పొందిన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అయితే ఈ అంశంలో అతడు కొల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు?
a) మంచిబాలుడు-మంచి బాలికల నీతి
b) అధికారం సాంఘికక్రమాన్ని పాటించడం
c) వ్యక్తిగత సూత్రాలు-అంతరాత్మదశ
d) ఒప్పందాలు-వ్యక్తిగత హక్కులు - చట్ట బద్ధంగా అంగీకరించిన నీతి
- View Answer
- సమాధానం: c
4. ఎప్పుడూ విమానం చూడని సిరి ఆకాశంలో తొలిసారి విమానం చూసినప్పుడు దాన్ని తెల్లపక్షిగా గుర్తించడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది?
a) సాంశీకరణ
b) అనుగుణ్యత
c) సమతుల్యత
d) వ్యవస్థీకరణ
- View Answer
- సమాధానం: a
5. అవినీతి ప్రభుత్వం అనవసరమైన పథకాలు ప్రవేశపెడుతూ ప్రజాధనాన్ని వృథా చేస్తుందని భావించిన నరేష్.. చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని తెలిసి కూడా ఆదాయపు పన్ను చెల్లించడానికి నిరాకరిస్తున్నాడు. అతడు కొల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు?
a) దశ- i
b) దశ- v
c) దశ- vi
d) దశ - iv
- View Answer
- సమాధానం: c
6. కింది వాటిలో పియాజె సంజ్ఞానాత్మక వికాసం అంత:సూచన కానిది ఏది?
a) పిల్లల అభ్యసన సంసిద్ధత పట్ల సంవేదన కనబర చడం
b) వైయుక్తిక భేదాలను అంగీకరించడం
c) ఆవిష్కరణ అభ్యసనం
d) శాబ్దిక శిక్షణ అవసరం
- View Answer
- సమాధానం: d
7.సరయు.. శంకువును చూసి వివిధ కోణాల్లో గీస్తుంది. కానీ శంకువు న మూనా లేనప్పుడు గీయలేదు. పియాజె ప్రకారం ఆమె ఏ దశకు చెందుతుంది?
a) సంవేదన చాలక దశ
b) నియత ప్రచాలక దశ
c) అనియత ప్రచాలక దశ
d) పూర్వ ప్రచాలక దశ
- View Answer
- సమాధానం: c
8. కొల్బర్గ్ ప్రకారం విద్యార్థుల్లో నైతిక విలువలను ఏ విధంగాపెంపొందించవచ్చు?
a) మతబోధ నకు ప్రాధాన్యమివ్వడం
b) ప్రవర్తనా నియమాలు రూపొందించడం
c) నైతిక విషయాలపై జరిగే చర్చల్లో వారిని పాల్గోనేలా ప్రోత్సహించడం
d) ఏ విధంగా ప్రవర్తించాలో కఠినంగా నిర్దేశించడం
- View Answer
- సమాధానం: c
9. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజిగౌడ్ విద్యార్థులను ఉద్దేశిస్తూ ‘వైయుక్తిక నియోజనాలను మీరు వ్యక్తిగతంగా ప్రభావవంతంగా అభ్యసించడానికి రూపొందించారు. కాబట్టి నిర్దేశించిన నియోజనాలు ఎవరి సహాయం లేకుండా పూర్తి చేయాలి’ అని చెప్పారు. ఇది కొల్బర్గ్ నైతిక వికాసంలోని ఏ దశకు సంబంధించింది?
a) సంప్రదాయస్థాయి 4- న్యాయం, చట్టం
b) ఉత్తర సంప్రదాయ స్థాయి 5- సామాజిక క్రమబద్దత
c) పూర్వ సంప్రదాయ స్థాయి 1- దండనను తిప్పించుకోవడం
d) పూర్వ సంప్రదాయ స్థాయి 2-వైయుక్తికత, ఇచ్చిపుచ్చుకోవడం
- View Answer
- సమాధానం: a
10. పిల్లలు ప్రచోదనాలతో కాకుండా అంతర్గత భావాల ఆధారంగా స్పందించడం నేర్చుకుంటారని తెలిపిందెవరు?
a) చోమ్ స్కీ
b) వైగోట్ స్కీ
c) బ్రూనర్
d) రోజర్స్
- View Answer
- సమాధానం: a
11.11 నెలల కల్యాణి రిఫ్రిజిరేటర్ వెనకాల పడిన బంతిని వెతికే ప్రయత్నం చేస్తుంది. అయితే కల్యాణిలో ఏర్పడిన సంజ్ఞానాత్మక వికాస భావన?
a) పదిలపరుచుకునే భావన
b) విపర్యయాత్మక భావన
c) వస్తు స్థిరత్వ భావన
d) అహంకేంద్రవాదం
- View Answer
- సమాధానం: c
12. చేతికి గాజులు ధరించే లక్ష్మి Colour Pyramid rings లోని ఒక Ringని గాజులాగా చేతికి ధరించడం ఏ సంజ్ఞానాత్మక అంశాన్ని సూచిస్తుంది?
a) సాంశీకరణ
b) అనుగుణ్యత
c) సంవేదన
d) సమతుల్యత
- View Answer
- సమాధానం: a
13. నర్సరీ చదువుతున్న సిరి తన పాఠశాలకు వెళ్లేటప్పుడు ఆమె ఆడుకునే టేడ్డీబేర్ బొమ్మకు అల్లరి చేయవద్దని, భోజనం చేయమని చెప్పడం ఏ లక్షణాన్ని సూచిస్తుంది?
a) సర్వాత్మక వాదం- ఇంద్రియచాలక దశ
b) అహంకేంద్రవాదం-పూర్వ ప్రచాలక దశ
c) పదిలపరుచుకునే భావన - పూర్వ ప్రచాలక దశ
d) ఎనిమిజమ్- పూర్వ ప్రచాలక దశ
- View Answer
- సమాధానం: d
14. మానసిక కల్పనలను పరీక్షించడం, సమస్యా పరిష్కరణలో ఒకే కారకంపై దృష్టి నిలపకుండా వివిధ కోణాల్లో ఆలోచించి పరిష్కరించడం చేస్తున్న శివాని ఏ సంజ్ఞానాత్మక వికాసదశకు చెందుతుంది?
a) ఇంద్రియచాలక దశ
b) పూర్వ ప్రచాలక దశ
c) మూర్త ప్రచాలక దశ
d) అమూర్త ప్రచాలక దశ
- View Answer
- సమాధానం: d
15.అర్ధచంద్రాకార చందమామను చూసిన సిరి ‘ఆకాశంలో చందమామ కనపడడం లేదు’ అని తెల్పడంలో ఆమెకు ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ ఏది?
a) ఇంద్రియచాలక దశ
b) నియత ప్రచాలక దశ
c) అనియత ప్రచాలక దశ
d) పూర్వ ప్రచాలక దశ
- View Answer
- సమాధానం: d
16. పర్యావరణ పరిరక్షణ తన బాధ్యతగా భావించి మొక్కల పెంపకంలో, పరిరక్షణలో సంతృప్తి కలిగి ఉండే భావన ఉన్న నైతిక వికాసస్థాయి ఏది?
a) సంప్రదాయ స్థాయి-iv వ దశ
b) సంప్రదాయ స్థాయి-iiiవ దశ
c) ఉత్తర సంప్రదాయ స్థాయి-vవ దశ
d) ఉత్తర సంప్రదాయ స్థాయి-vజీవ దశ
- View Answer
- సమాధానం:d
17. సాయంత్రం నాన్న సినిమాకు తీసుకెళ్తానంటే హోమ్వర్క చేస్తానని తెలిపిన సిరి నైతిక వికాసస్థాయి, దశలు వరసగా?
a) స్థాయి i, దశ- i
b) స్థాయి i, దశ- ii
c) స్థాయి ii, దశ-iii
d) స్థాయి i, దశ- iv
- View Answer
- సమాధానం: b
18. రమేశ్ సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రయోగపూర్వకంగా మాత్రమే కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆధారాలు లేకుండా ఏ విషయాలను అంగీకరించడు. అయితే సంజ్ఞానాత్మక వికాసంలో రమేశ్ ఏదశకు చెందుతాడు?
a) ఇంద్రియచాలక దశ
b) పూర్వ ప్రచాలక దశ
c) మూర్త ప్రచాలక దశ
d) అమూర్త ప్రచాలక దశ
- View Answer
- సమాధానం: d
19. సిరి తన గ్రామంలో ఎక్కడనుంైచె నా ఇంటికి వెళ్తుంది. కానీ ఎలా వెళ్లాలో తెలపలేదు.అయితే సిరికి ఉన్న సంజ్ఞానాత్మక వికాసదశ?
a) ఇంద్రియచాలక దశ
b) పూర్వ ప్రచాలక దశ
c) మూర్త ప్రచాలక దశ
d) అమూర్త ప్రచాలక దశ
- View Answer
- సమాధానం: c
20. పియాజె సంజ్ఞానాత్మాక వికాసాన్ని సూచించేది ఏది?
a) పిల్లలు అన్వేషణ, అనుభవం ద్వారా నేర్చుకుంటారు
b) పిల్లలు నిబంధనం ద్వారా నేర్చు కుంటారు
c) పిల్లలు అనుకరణ ద్వారా నేర్చుకుంటారు
d) పిల్లలు భాషా వికాసం వల్ల నేర్చుకుంటారు
- View Answer
- సమాధానం: a
21.కింది వాటిలో సంజ్ఞానాత్మాక ప్రక్రియను సరిగా సూచించే ది ఏది?
a) సంవేదన- ప్రత్యక్షం-భావగ్రహణం
b) భావగ్రహణం- ప్రత్యక్షం- సంవేదన
c) సంవేదన-భావగ్రహణం- ప్రత్యక్షం
d) ప్రత్యక్షం- సంవేదన- భావగ్రహణం
- View Answer
- సమాధానం: a
22. తల్లి కోపగించుకుంటుందనే కారణంతో నందిని తన తల్లికి తెలియకుండా ఏ వస్తువును తీసుకోదు. కొల్బల్గ్ ప్రకారం ఆమె ఏ దశకు చెందుతుంది?
a) దశ- i
b) దశ- ii
c) దశ- iii
d) దశ - iv
- View Answer
- సమాధానం: a
23.మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించిన ఉపాధ్యాయుడిగా ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు కొల్బర్గ్ సూచించిన ఏ దశను అనుసరిస్తారు?
1) శిక్ష- విధేయత
2) వైయుక్తికం, ఇచ్చిపుచ్చుకోవడం
3) మంచి అంతర వ్యక్త్తిత్వ సంబంధాలు
4) సాంఘిక క్రమాన్ని నిర్వహించడం- వ్యక్తిగత సూత్రాలు
a) 1, 2
b) 1, 3
c) 3, 4
d) 4, 1
- View Answer
- సమాధానం: a
24. శిశువులు సార్వత్రిక భాషాసూత్రాలను, వ్యాకర ణ సూత్రాలను, నిర్మాణాలను నిక్షిప్తం చేసుకునే సామర్థ్యంతో జీవిస్తారని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు?
a) చోమ్ స్కీ
b) రోజెర్స్
c) స్కిన్నర్
d) వైగోట్ స్కీ
- View Answer
- సమాధానం: a
25. మనోవిజ్ఞానశాస్త్రాన్ని అభ్యసించిన ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు ఇతరులతో ఉన్న సంబంధాలు, పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావనగా దేన్ని భావిస్తారు?
a) ఆదర్శ ఆత్మభావన
b) వాస్తవిక ఆత్మభావన
c) సార్వత్రిక ఆత్మభావన
d) ఆర్జిత ఆత్మభావన
- View Answer
- సమాధానం: a
26. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి నూతన గృహ నిర్మాణం చేపట్టేవారు తమ గృహ ఆవరణలో రెండు మొక్కలు నాటిన తర్వాతే అనుమతి ఇచ్చేలా నియమాలను మార్చాలని సరిత ప్రయత్నిస్తోంది. అయితే ఆమె ఏ నైతిక వికాశ దశకు చెందుతుంది?
a) మంచిబాలుడు - మంచి బాలికల నీతి
b) అధికారం సాంఘిక క్రమాన్ని పాటించడం
c) ఒప్పందాలు - వ్యక్తిగత హక్కులు - చట్ట బద్ధంగా అంగీకరించిన నీతి
d) వ్యక్తిగత సూత్రాలు-అంతరాత్మదశ
- View Answer
- సమాధానం: c
27. అనుభవ పూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
a) చోమ్ స్కీ
b) రోజర్స్
c) ిపియాజె
d) వైగోట్ స్కీ
- View Answer
- సమాధానం: b
28. ఎరిక్సన్ ప్రకారం ఆరో తరగతి విద్యార్థులకు సరైన శిక్షణ, తగిన విద్య, మంచి ఆదర్శాలను అందించడం వల్ల వారిలో పెంపొందే లక్షణం ఏది?
a) శ్రమశీలత
b) చొరవ
c) గుర్తింపు
d) స్వయం ప్రతిపత్తి
- View Answer
- సమాధానం: a
29. సరళ పరిసరాలతో పరస్పర చర్యలు జరపడానికి చొరవ తీసుకోవడం వల్ల అనుసరించడం, ప్రణాళికలను ఏర్పరుచుకోవడం, కృత్యాలు, లక్ష్యాలను సాధించడంలో గుణాత్మకతను ఏర్పరుచుకుంటుంది. అయితే సరళకు ఉన్న మనోసాంఘిక వికాసదశ ఏది?
a) క్రీడాదశ
b) పాఠశాల దశ
c) ఉత్తర శైశవం
d) కౌమార దశ
- View Answer
- సమాధానం: a
30. ఉపాధ్యాయుడితో మంచి బాలిక అనిపించుకోవడానికి ప్రార్థనా సమయంలో నేటి పద్యాన్ని చదివే సునీత నైతిక వికాస దశ ఏది?
a) దశ- ii
b) దశ- iii
c) దశ- iv
d) దశ - v
- View Answer
- సమాధానం: b