Skip to main content

పెరుగుదల - వికాస నియమాలు

పెరుగుదల - వికాసం
పెరుగుదల, వికాసం వేర్వేరుగా కనిపించినప్పటికీ, ఇవి రెండు అవిభాజ్యాలు. ఒకదానినొకటి పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి.

వికాస నియమాలు..
వికాసం క్రమానుగతమైంది :
  • ఇది ఒక కచ్చితమైన వరుస క్రమాన్ని పాటిస్తుంది.
  • వికాసం నిర్దిష్టంగా ఒక క్రమాన్ని పాటిస్తూ కొనసాగుతుంది.
    ఉదా: శారీరక వికాసం
  • శిశువు బోర్లపడిన తరువాత పాకడం, అనంతరం దోగాడటం, తరువాత కూర్చోవడం, అనంతరం నిలబడటం, నడవటం, నడిచిన తరువాత పరిగెత్తడం వంటి ప్రక్రియ.
నైతిక వికాసం :
  • పూర్వ సంప్రదాయ స్థాయి
  • సంప్రదాయ స్థాయి
  • ఉత్తర సంప్రదాయ స్థాయి
ఉదా2:
  • శిశువు వృత్తం గీసిన తరువాత చతురస్రాన్ని గీయడం
  • శిశువు అంకెలను నేర్చుకున్న తరువాత కూడటం, తీసివేయడం నేర్చుకోవడం
సాంఘిక వికాసం :
  • ఏకాంత క్రీడ తరువాత సమాంతర క్రీడ, సమాంతర క్రీడ అనంతరం సహకార క్రీడల్లో శిశువు పాల్గొనడం.
భాషా వికాసం :
  • శ్రవణం (Listening)తరువాత భాషణం (speaking), అనంతరం పఠనం (reading)ఆ తరువాత లేఖనం (writing)
  • మూర్త భావనలు నేర్చుకున్న అనంతరం అమూర్త భావనలు.
వికాసంలో వ్యక్తిగత భేదాలుంటాయి :
  • వ్యక్తుల వివిధ వికాసాంశాల్లో వైయక్తిక భేదా లుంటాయి.
    ఉదా: విద్యార్థుల ప్రజ్ఞను పరిశీలిస్తే
    మూఢులు 0-25
    బుద్ధిహీనులు 25-50
    అల్పబుద్ధులు 51-70
    మందబుద్ధులు 71-80
    సగటు కంటే తక్కువ 81-90
    సగటు ప్రజ్ఞ్ఞ కలవారు 91-110
    సగటు కంటే ఎక్కువ 111-120
    ఉన్నత ప్రజ్ఞ కలవారు 121-140
    అత్యున్నత ప్రజ్ఞ కలవారు 140-150
  • విద్యార్థుల మార్కుల్లో (విద్యాసాధన) తేడా ఉంటుంది.
  • వికాసం సాధారణం నుంచి ప్రత్యేకతకు, నిర్దిష్టతకు దారి తీస్తుంది.
  • శిశువు వికాసం మొదట సాధారణీకరించిన సులువైన అంశాలతో ప్రారంభమై, క్లిష్టమైన నిర్దిష్ట అంశాలకు దారితీస్తుంది.
    ఉదా: శైశవ దశలో శిశువు ఏడుపు అనే ఉద్వేగాన్ని.. ఆకలి, కోపం, భయం వేసినప్పుడు, తల్లి స్పర్శ పొందక పోవడం వంటి సంద ర్భాల్లో సాధారణీకరించుకుంటారు. అయితే తరువాత దశలో నిర్దిష్ట ఉద్వేగాలను వ్యక్తం చేశాడు.
శారీరక వికాసం :
  • శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది.
  • బాల్యదశలో శారీరక వికాసం నెమ్మదిగా జరుగుతుంది.
  • కౌమార దశలో శారీరక వికాసం వేగాన్ని పుంజుకుంటుంది.
  • వయోజన దశలో శారీరక వికాస వేగం తగ్గుతుంది.
వికాసం రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది :
శిరోఃపాదాభిముఖ వికాసం :
  • వికాసం తలనుంచి ప్రారంభమై దేహ మధ్య భాగానికి వ్యాపిస్తుంది. శిశువు తల ముందు ఏర్పడి, అనంతరం దేహం దిగువ భాగం (పాదాల) వరకు వ్యాపిస్తుంది.
సమీప దూరస్థ వికాసం
  • దేహం మధ్య భాగంలో వికాసం ప్రారంభమై ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.
వికాసం సంచితమైంది
  • శిశువు ప్రవర్తనలో ఏర్పడే కొత్త మార్పులు అకస్మాత్తుగా జరగవు.
  • ప్రతి ప్రవర్తన మార్పు కూడా గత అనుభవాల ద్వారా ఏర్పడుతుంది.
    ఉదా: శిశువు ముద్దు పలుకుల ఆధారంగా పదాలు నేర్చుకోవడం, వాటి ఆధారంగా వాక్యాలు నేర్చుకోవడం, వాక్యాలతో భాషను నేర్చుకోవడం.
    వృత్తం ఆధారంగా చతురస్రం నేర్చుకోవటం
  • జ్ఞానం ఆధారంగా అవగాహన
    అవగాహన ఆధారంగా వినియోగం
    వినియోగం ఆధారంగా విశ్లేషణం
    విశ్లేషణాధారంగా సంశ్లేషణ
    సంశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం.
  • భావావేశ రంగం
    గ్రహించడం ఆధారంగా ప్రతిస్పందించడం
    ప్రతిస్పందించడం ఆధారంగా విలువకట్టడం
    విలువకట్టడం ఆధారంగా వ్యవస్థాపనం
    వ్యవస్థాపనం ఆధారంగా శీలస్థాపనం
  • మానసిక చలనాత్మక రంగం
    అనుకరణ ఆధారంగా హస్తలాఘవం
    హస్తలాఘవం ఆధారంగా సునిశితత్వం
    సునిశితత్వం ఆధారంగా సమన్వయం
    సమన్వయం ఆధారంగా సహజీకరణ
వికాసం ఏకీకృత మొత్తం
  • వికాసంలోని వివిధ అంశాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి.
    ఇందులోని అంశాలు విడివిడిగా ఉండవు.
    ఉదా:
  • శారీరక వికాసం - మానసిక వికాసాన్ని
    మానసిక వికాసం - ఉద్వేగ వికాసాన్ని
    ఉద్వేగ వికాసం - నైతిక వికాసాన్ని
    నైతిక వికాసం - సాంఘిక వికాసాన్ని
    పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి.
వికాసం అనువంశికత, పరిసరాల వల్ల ఏర్పడుతుంది
  • తల్లిదండ్రుల నుంచి వచ్చిన లక్షణాలు, పరి సర కారకాల వల్ల శిశువు వికాసం ప్రభావిత మవుతుంది.
వికాసం అన్ని దశల్లో ఒకేవిధంగా ఉండదు
  • శిశువులోని వివిధ వికాసాంశాల వృద్ధి వేగం అంతటా ఒకే విధంగా ఉండదు.
    ఉదా: శైశవదశలో శారీరక వికాసం వేగంగా, బాల్యదశలో నెమ్మదిగా ఉంటుంది. అదే కౌమార దశలో వేగం పుంజుకుంటుంది. తిరిగి వయోజనదశకు వచ్చే సరికి వేగంలో తగ్గుదల ఉంటుంది.
అనువంశికత :
  • అనువంశికత శారీరక లక్షణాలను, ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది. అనువంశికత, పరిసరాల సమష్టి ఫలితమే - వ్యక్తి వికాసం అని ఉడ్‌వర్త్ నిర్వచించాడు.
  • తల్లిదండ్రులు, తాతలు, జాతుల నుంచి సంక్ర మించిన జన్యుపరమైన లక్షణాలను అనువం శికత అంటారు.
  • మానవుడిలో 46 క్రోమోజోమ్‌లుంటాయి. (23 జతలు)
  • 22 జతలు శారీరక క్రోమోజోమ్‌లు, ఒక జత లింగ నిర్ణయ క్రోమోజోమ్‌లుంటాయి
  • పురుషుల్లో XY,స్త్రీలలో XXఅనే లింగ నిర్ణయ క్రోమోజోమ్‌లుంటాయి.
  • స్త్రీ, పురుషుల్లోనిXYకలయిక వల్ల - మగశిశువు,XXకలయిక వల్ల - ఆడశిశువు జన్మిస్తుంది.
  • క్రోమోజోముల్లో జన్యువులు ఉంటాయి.
  • అండంతో వీర్యకణం ఫలదీకరణం చెందడం వల్ల సంయుక్తబీజం ఏర్పడుతుంది. దీనినే 'జైగోట్' అంటారు.
  • జైగోట్ మానవ జీవితానికి తొలిమెట్టు.
  • ఒక జైగోట్ వల్ల ఒక శిశువు జన్మిస్తుంది. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో 'కవలలు' జన్మిస్తారు.
సమరూప కవలలు
  • ఒకే సంయుక్త బీజం రెండు భాగాలుగా విడిపోవడం వల్ల సమరూప కవలలు జన్మి స్తారు. వీరికి ఒకే రూపంతో పాటు ఒకే లింగానికి చెంది ఉంటారు.
విభిన్న కవలలు
  • రెండు అండాలతో, రెండు వీర్యకణాల కలయిక వల్ల రెండు వేర్వేరు సంయుక్తబీజాలు ఏర్పడి, విభిన్న కవలలు జన్మిస్తారు.
  • వీరు భిన్న రంగానికి చెంది ఉంటారు.
అనువంశికత నియమాలు:
ఆస్ట్రియా దేశానికి చెందిన జన్యుశాస్త్ర పితామ హుడైన జాన్ గ్రెగర్ మెండల్ మూడు అనువంశికత నియమాలు పేర్కొన్నాడు.

సారూప్యతా నియమం :
తల్లిదండ్రుల లక్షణాలు యథాతథంగా పిల్ల లకు రావడమే సారూప్యతా నియమం.
ఉదా: అందమైన తల్లులకు, అందమైన పిల్లలు, అధిక ప్రజ్ఞావంతులకు, అధిక ప్రజ్ఞ కలిగిన శిశువులు జన్మించడం.

వైవిధ్య నియమం: తల్లిదండ్రుల లక్షణాలకు భిన్నమైన లక్షణాలు గల శిశువులు జన్మించ డాన్ని 'వైవిధ్య నియమం' అంటారు.
ఉదా: అందమైన తల్లులకు అంద విహీనులు జన్మించడం, అధిక ప్రజ్ఞావంతులకు సగటు ప్రజ్ఞావంతులు జన్మించడం.

ప్రతిగమన నియమం: రక్త సంబంధీకులు, మేనరిక వివాహాల వల్ల జన్యువుల తరుగుద లతో, తల్లిదండ్రులకు పూర్తి భిన్నమైన లక్ష ణాలు గల శిశువులకు జన్మించడాన్ని ప్రతిగ మన నియమం అంటారు.
ఉదా: అందమైన, ఆరోగ్యంగా ఉన్న తల్లి దండ్రులకు, అంగవైకల్యం కల శిశువులు జన్మించడం. అధిక ప్రజ్ఞావంతులకు మూఢు లు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు జన్మించడం.

పెరుగుదల - వికాసం
పెరుగుదల వికాసం
ఎత్తు, బరువు అంతర్గత, బహిర్గత అవయవాల్లోని మార్పులు పెరుగుదలను సూచిస్తాయి వ్యక్తి నైతికత, ఉద్వేగాలు, సాంఘిక పరిపక్వత, భాషాపరమైన అంశాలు వికాసాన్ని సూచిస్తాయి
పెరుగుదల సంకుచితమైంది వికాసం సమగ్రమైంది
పెరుగుదలను కొలవవచ్చు ఉదా: వ్యక్తి బరువు వికాసాన్ని కచ్చితంగా కొలవడానికి వీలుకాదు. ఉదా: వ్యక్తి నైతికత
పెరుగుదల పరిమాణాత్మకమైంది వికాసం గుణాత్మకమైంది
పెరుగుదలను బహిర్గతంగా గుర్తించవచ్చు వికాసం అంతర్గత ప్రక్రియ కాబట్టి బహిర్గతంగా గుర్తించలేం
పెరుగుదల జీవితంలోని ఒక దశలో ఆగిపోతుంది. వికాసం జీవితాంతం కొనసాగుతుంది

మాదిరి ప్రశ్నలు

1. రవి ఒక హైస్కూల్ విద్యార్థి. తన ఆకలి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయికి చెందుతాడు?
  ఎ) ఉన్నత సంప్రదాయ స్థాయి
  బి) ఉత్తర సంప్రదాయ స్థాయి
  సి) పూర్వ సంప్రదాయ స్థాయి
  డి) సంప్రదాయ స్థాయి

Published date : 26 Nov 2018 02:32PM

Photo Stories