TS Inter Results 2023 Date : బిగ్ బ్రేకింగ్... 9వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో ఫలితాలు చూడొచ్చు
అయితే తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలకు.. అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఈసారి ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను చూడాలంటే https://results.sakshieducation.com ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఇంటర్ ఫలితాల వెల్లడి ప్రక్రియ తుది దశకు చేరుకుంది. స్పాట్ వ్యాల్యుయేషన్, మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్ ప్రక్రియ, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు విధానాలు ఇప్పటికే ముగిశాయి. ప్రతీ సంవత్సరం పరీక్షలు, ఫలితాల వెల్లడిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈసారి ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఇదే స్ఫూర్తిని ఫలితాల వెల్లడిలోనూ కనబరచాలనే ఆలోచనలో ఉన్నారు.
తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను చెక్ చేసుకోండిలా..
1) https://results.sakshieducation.com దీనిపై క్లిక్ చేయండి
2) హోం పేజీపై కనపడుతున్న టీఎస్ ఇంటర్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి
3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి
4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది
5) మీ జాబితాను అక్కడే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఆన్‌లైన్ ఫీడింగ్‌లో గతంలో అనేక పొరపాట్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై అధికారులు లోతుగా అధ్యయనం చేశారు. మార్కుల నమోదులో గతంలో ఎందుకు సమస్యలొచ్చాయి? సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలా? వ్యక్తుల తప్పిదాలా? అనే అంశాలపై చర్చించి ఈ ఏడాది అలాంటి తప్పులకు చోటివ్వకుండా చూస్తున్నారు. అయితే మే 9వ తేదీ, ఉదయం 11 గంటలకు తెలంగాణ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నారు.
9,48,010 మంది విద్యార్థులు ఎదురుచూపు..
తెలంగాణలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి 9,48,010 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంతమంది మార్కుల నమోదు విషయంలో ప్రత్యేక పరిశీలనకు అధికారులను నియమించారు. తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను https://results.sakshieducation.com లో చూసుకోవచ్చు.