సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పలితాల విడుదల వేళ కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డ్ ముకుతాడు వేసింది.
ప్రైవేటు ప్రకటనలకు ఇంటర్ బోర్డ్ కట్టడి
ఇష్టారాజ్యంగా ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టింది. ఏ ప్రకటన ఇవ్వాలన్నా ముందుగా బోర్డ్ అనుమతి తీసుకోవాల్సిందేనంటూ రాత పూర్వక ఆదేశాలు జారీ చేసింది. ప్రకటనలు పరిశీలించి, అనుమతి ఇచ్చేందుకు వీలుగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కంట్రోలర్ ఆఫ్ ఇంటర్ ఎగ్జామినేషన్స్, ఇంటర్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ (పరీక్షల విభాగం), ఇంటర్ బోర్డ్ పాలన విభాగం జాయింట్ సెక్రటరీ, అకడమిక్ విభాగం జాయింట్ సెక్రటరీ, బోర్డ్ ప్రజా సంబంధాల అధికారి సభ్యులుగా ఉంటారు.కాలేజీలు పరీక్షల ఫలితాలను ప్రసార మాధ్యమాల్లో ప్రకటన ఇవ్వడానికి ముందు.. ఆ ప్రకటనతో బోర్డ్‌కు దరఖాస్తు చేయాలి. కమిటీ పరిశీలించి, అనుమతి ఇస్తుంది.