Intermediate: ప్రతిభావంతులకు సన్మానం.. ఒక్కొక్క విద్యార్థికి రూ.5 వేలు నగదు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కళాశాలల నుంచి ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి మెరుగైన మార్కులు, ర్యాంకులు సాధించిన విద్యార్థులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేకంగా సత్కరించారు.
చదవండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!
సచివాలయంలోని తన చాంబర్‌లో మే 10న ఉత్తమ ర్యాంక్, మార్కులు సాధించిన విద్యార్థులకు శాలువా కప్పి జ్ఞాపికలతో సన్మానించారు. ఒక్కొక్క విద్యార్థికి రూ.5 వేలు చొప్పున నగదు బహుమతిని కూడా మంత్రి అందజేశారు. ఆయన ప్రతి విద్యార్థితో, తల్లిదండ్రులతో మాట్లాడి అభినందించారు.
చదవండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!
Published date : 11 May 2023 03:39PM